ప్రభాస్ కి చెక్ పెట్టనున్న సమంత – ఇది నిజమేనా…?

సాహూ లాంటి పెద్ద చిత్రం తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నటువంటి తాజా చిత్రం జాన్ (వర్కింగ్ టైటిల్). కాగా ప్రస్తుతానికి ప్రభాస్ జిల్ ఫెమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో జాన్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. కాగా 1960 ల నాటి కాలంలో జరిగినటువంటి ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. కాగా ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఎన్నో అంచనాల నడుమన విడుదలైనటువంటి సాహో చిత్రం దారుణమైన పరాజయాన్ని సొంతం చేసుకోవడమతొ జాన్ అనే చిత్ర కథ పై మరొకసారి క్షుణ్ణమైన పరిశీలన జరపాలని ప్రభాస్ దర్శకుడిని కోరారని సమాచారం.

ఇక అసలు విషయానికొస్తే… వరుసగా విజయవంతమైన చిత్రాలు చేస్తూ, మంచి జోరు మీద ఉన్నటువంటి సమంత తాజాగా తమిళ హిట్ మూవీ 96 రీమేక్ లో నటిస్తుంది. కాగా ఈచిత్రంలో శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. కాగా దిల్ రాజు నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రాన్ని ఖచ్చితంగా ఈ ఏడాదిలోనే విడుడల చేయడానికి సన్నాహలు చేస్తున్నారు. కాగా సమస్య ఏంటి అంటే 96 రీమేక్ చిత్రణకి “జాను” అనే టైటిల్ పెట్టె ఆలోచనలో ఉన్నారని సమాచారం. అయితే ప్రభాస్ కూడా ఈ చిత్రానికి “జాన్” అనే టైటిల్ పై కన్నేశారు. కాగా సమంత సినిమాకు కూడా ఇలాంటి టైటిల్ పెట్టి ముందుగానే విడుదల చేస్తే ఈ దెబ్బ ప్రభాస్ పై పడుతుందని సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. కానీ ఎవరు వెనక్కి తగ్గి టైటిల్ మారుస్తారో అని అందరు కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఏఈ విషయంలో ఒక అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

error: Content is protected !!