Movies

మూడు సార్లు ప్రాణాలతో పోరాడిన అక్కినేని చివరి రోజులు ఎంత కష్టంగా గడిచాయో తెలుసా?

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఫామిలీ లైఫ్,సినీ లైఫ్ కూడా తెరచిన పుస్తకమే అయినా ఆయన మూడు సార్లు చావు అంచుల వరకూ వెళ్ళివచ్చారని మాత్రం అందరికీ తెలీదు. అయినా ఈయన 90ఏళ్ళు బతికారు. నిజానికి సినిమా వాళ్లంటే ఆహారపు అలవాట్లు,వ్యసనాల వలన ఆరోగ్యం పాడుచేసుకున్నవాళ్ళు ఎక్కువగా ఉంటారు. చిన్నవయస్సులోనే మృత్యువాత పడతారు . అక్కినేని మాత్రం క్రమశిక్షణకు మారుపేరు.

మద్యం అలవాటు లేని అక్కినేని ఎప్పుడూ నవ్వుతూ సరదాగా సెటైర్లు వేస్తూ ఆటపట్టిస్తూ ఉండేవారు. 1973లో మాత్రం ఆయనకు గుండె చుట్టూ కొలెస్ట్రాల్ చేరడంతో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసారు. చాలా రకాల భయాలు అనుమానాలు గల ఆరోజుల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. కట్టుదిట్టమైన ఆహారపు అలవాట్లతో ఆపరేషన్ తర్వాత ఆయన 40ఏళ్ళు బతికారు. ఇలా నాలుగు దశాబ్దాలు బతికున్న అతికొద్దిమందిలో అక్కినేని ఒకరు. ఓపెన్ హార్ట్ సర్జరీ తర్వాత ప్రతిరోజూ స్కాచ్ విస్కీ ఒక మోతాదులో రోజూ తాగాలని డాక్టర్స్ సూచించడంతో, స్కాచ్ విస్కీ తయారయ్యే ప్రదేశానికి వెళ్లి అంతా గమనించి, తుదిశ్వాస వరకూ ఔషధంలా మోతాదులో తాగారు.

ఇక సర్జరీ తర్వాత చెన్నై హోటల్ సవేరా లో కొద్దిమంది పాత్రికేయులతో అక్కినేని సమావేశం పెట్టినపుడు అక్కడికి ఎన్టీఆర్ వచ్చి అక్కినేని ని హత్తుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఆపరేషన్ ఎక్కడ ఎలా జరిగిందో అక్కినేని అప్పుడు వివరించారు. ఇక 1988లో మరోసారి గుండెపోటు రావడంతో మరోసారి సర్జరీ ఆయన గుండె తట్టుకుంది. 96ఏళ్ళు బతకాలని ఆశగా ఉండేదట. అయితే 90ఏళ్ళ వయస్సులో మృత్యుదేవత పిలిచింది. కేన్సర్ సోకడంతో కడుపులో కణితి తొలగించారు. అయినా ఆయన బతికేది ఇక రోజులే అని తెల్సినా ఆయన నవ్వుతూ నవ్విస్తూ హాయిగా గడిపేశారు. నన్ను ఓదార్చడానికి ,సానుభూతి చూపడానికి ఎవరూ రావద్దని చెప్పేవారట. ఎవరు ఎక్కడున్నా ప్రతి ఆదివారం ఫ్యామిలీ అంతా వచ్చి తనతో ఒక పూట భోజనం చేయాలని నియమం పెట్టారట.