Politics

TSRTC కొత్త చార్జీలు – ఎక్కడికి ఎంత పెరిగిందంటే…?

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దీ రోజులుగా జరుగుతున్నటువంటి ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. సమ్మె తరువాత ఎట్టకేలకు ఆర్టీసీ కార్మికులందరినీ కూడా తిరిగి తమ తమ విధుల్లోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు సీఎం కేసీఆర్… కాకపోతే ఇప్పటివరకు ఉన్నటువంటి చార్జీలను పెంచుతూ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే గత కొంత కాలంగా నష్టాల్లో నడుస్తున్నటువంటి ఆర్టీసీ సంస్థను తిరిగి గాడిలో పెట్టాలంటే చార్జీలను పెంచడం ఒక్కటే మార్గమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

కాగా కిలో మీటర్‌కు 20 పైసలు పెంచుతున్నామని, వచ్చే నెల 2 వ తేదీ నుండి ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయని ప్రకటించారు. ఈ పెరిగిన ధరల వలన ఆర్టీసీకి సంవత్సరానికి సుమారు రూ.750 కోట్ల మేర ఆదాయం పెరుగుతుందని స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతానికి అడ్వాన్స్ రిజర్వేషన్ చేస్తే అదనపు చార్జీలు వర్తిస్తాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

రాష్ట్రంలో పెరిగిన కొన్ని చార్జీల వివరాలు :

హైదరాబాద్ – విజయవాడ సుమారు రూ.53
హైదరాబాద్ – విశాఖపట్నం సుమారు రూ.125
హైదరాబాద్ – ఒంగోలు సుమారు రూ.65
హైదరాబాద్ – వరంగల్ సుమారు రూ.30
హైదరాబాద్ – కరీంనగర్ సుమారు రూ.32
హైదరాబాద్ – నిజామాబాద్ సుమారు రూ.35
హైదరాబాద్ – ఆదిలాబాద్ సుమారు రూ.60
హైదరాబాద్ – ఖమ్మం సుమారు రూ.40