మహేష్ ని సూపర్ స్టార్ చేసిన సినిమా ఎదో తెలుసా?

తండ్రిని మించిన తనయునిగా తెలుగు ఇండస్ట్రీలో హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎదిగాడు. తనదైన మేనరిజం తో సత్తా చాటుతున్న మహేష్ విభిన్న పాత్రలలో మెప్పిస్తున్నాడు. శ్రీమంతుడు,భరత్ అనే నేను,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ తో పాటు పక్క మాస్ మూవీస్ పోకిరి,వన్ నేనొక్కడినే,వంటి సినిమాలు సరేసరి.

అయితే ప్రిన్స్ స్టార్ గా మొదట్లో పిలిపించుకుని సూపర్ స్టార్ స్థాయికి ఎదగడానికి మహేష్ కి కీలకంగా దోహదపడిన సినిమా అనగానే ఒక్కడు మూవీ గుర్తొస్తుంది. గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ మహేష్ కెరీర్ ని పూర్తిస్థాయిలో మార్చేసింది. పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే,మణిశర్మ సంగీతం, వెరసి మహేష్ ని మాస్ హీరో లుక్ లోకి తీసుకెళ్లాయి. హైదరాబాద్ పాతబస్తీ,రాయలసీమ ఫ్యాక్షన్ ని ముడిపెడుతూ వచ్చిన ఈ మూవీ 2003లో బిగ్గెస్ట్ హిట్ అయింది. ఈ మూవీ తమిళ,బెంగాలీ,కన్నడ భాషల్లో రీమేక్ అయ్యి ,హిట్ టాక్ తెచ్చుకుంది. అందుకే ఎన్ని బ్లాక్ బస్టర్స్ వచ్చిన ఫాన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేసిన సినిమా ఇదే.

మురారి,యువరాజు,రాజకుమారుడు లాంటి మూవీస్ తో ఫ్యామిలీ హీరోగా ఉండిపోయిన మహేష్ ని మాస్ హీరోగా నిలబెట్టిన ఘనత ఒక్కడు మూవీకి దక్కుతుంది. చూడాలని వుంది మూవీలో చిరంజీవిని విభిన్నంగా చూపించి హిట్ కొట్టిన గుణశేఖర్, ఒక్కడితో మహేష్ ని కొత్త లో చూపించి సక్సెస్ అయ్యాడు. ఎం ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాలో మహేష్ నటనకు తోడు ఓబుల్ రెడ్డిగా ప్రకాష్ రాజ్ చేసిన నటన,భూమిక ఫెరఫార్మెన్స్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం కామెడీ,పదునైన డైలాగ్స్ ఇలా అన్నీ కల్సివచ్చాయి. అందుకే 8నంది అవార్డులు అందుకుంది. నాలుగు ఫిలిం ఫేర్ అవార్డ్స్ వచ్చాయి.

error: Content is protected !!