అనుష్కకు సినిమాలు చేయాలని లేదా….కారణం ఇదే…???

బాహుబలి చిత్రం తర్వాత అనుష్క స్టార్‌ హీరోయిన్‌గా మారిపోవడం కన్ఫర్మ్‌ అని అంతా అనుకున్నారు.బాలీవుడ్‌లో కూడా అనుష్క ఓ రేంజ్‌లో దూసుకు పోతుందని భావించారు.కాని అనూహ్యంగా బాహుబలి తర్వాత అసలు అనుష్క సినిమాలు చేయడమే గగనం అయ్యింది.

ఆమె సినిమాలు చేద్దునా వద్దా అన్నట్లుగా చేస్తోంది.బాహుబలి తర్వాత అనుష్క ఇప్పటి వరకు కేవలం ‘భాగమతి’ చిత్రంను మాత్రమే విడుదల చేయగలిగింది.త్వరలో నిశబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సైజ్‌ జీరో సినిమా కోసం అనుష్క లావు అయ్యింది.ఆ కారణంగానే అనుష్క సినిమాలు తగ్గించిందని అంతా అనుకున్నారు.సన్నగా అయ్యేందుకు అనుష్క చాలా ప్రయత్నాలు చేసింది.దాదాపు ఆరు నెలల పాటు కష్టపడ్డట్లుగా వార్తలు వచ్చాయి.అయినా కూడా అనుష్క మాత్రం లావు తగ్గడం లేదు.దాంతో చేసేది లేక ఇక లావు తగ్గే ప్రయత్నాలు ఆపేసినట్లుగా సమాచారం అందుతోంది.లావు తగ్గాలనే ఆలోచనకు ఫుల్‌ స్టాప్‌ పెట్టినట్లుగా ఆమె సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.

అనుష్క నిశబ్దం సినిమాలో కూడా చాలా లావుగా కనిపించబోతుంది.ఆమె ఎప్పుడు చూసినా చాలా లావుగానే ఉంటుంది.కనుక అనుష్కకు సినిమాల్లో చేసే ఆలోచన లేదా, ఎందుకు ఆమె అలాగే కనిపిస్తుంది అంటూ స్వయంగా ఆమె ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సినిమాలు చేయాలనే ఉత్సాహం ఉంటే తప్పకుండా మరింత కష్టపడి అనుష్క బక్కగా అయ్యేందుకు ప్రయత్నించేది.కాని ఆమె మాత్రం అసలు సన్నగా అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

error: Content is protected !!