శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర.. ఈసారి ఎంతంటే?

పసిడి ధర మళ్లీ పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.39,720కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

షాకిచ్చిన వెండి
అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.70 పడిపోయింది. దీంతో ధర రూ.36,410కు తగ్గింది. ఇకపోతే బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర రూ.100 పెరిగింది. దీంతో వెండి ధర రూ.47,500కు చేరింది.

error: Content is protected !!