హార్స్ రైడింగ్ లో నంబర్ వన్ హీరో ఎవరు?

జానపద సినిమా నేపధ్యమే కాదు,మామూలు సినిమాల్లో కూడా గుర్రాలు కనిపిస్తాయి. హార్స్ రైడింగ్ లు ఉంటాయి. ఆనాటి హీరోల మొదలుకుని ఇప్పటి హీరోల వరకూ హార్స్ రైడింగ్ లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్ అని చెప్పాలి. తమ అభిమాన హీరోల హార్స్ రైడింగ్ చూసి ఫాన్స్ థియేటర్స్ లో ఈలలు,చప్పట్లతో సందడి చేస్తారు. క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన చారిత్రాత్మక చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి లో బాలయ్య హార్స్ రైడింగ్ అదిరింది. అంతకుముందు భైరవ ద్వీపం మూవీలో బాలయ్య హార్స్ పై విన్యాసాలు సూపర్ గా నిలిచాయి. సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో బాలయ్య హార్స్ రైడింగ్ చేస్తూ సింగల్ గా వెళ్లే అడవి గుర్రాన్ని పట్టుకోవడం అభిమానులను ఉర్రూతలూగించింది.

అంతేకాదు లెజెండ్ మూవీలో ఒళ్ళు గగుర్పాటు గలిగించేలా హార్స్ రైడింగ్ తో వీరోచిత పోరాటం సాగించి బాలయ్య ఫాన్స్ ని కుర్చీల్లో కూర్చోనీయలేదంటే అతిశయోక్తి కాదు. మరి మెగాస్టార్ చిరంజీవి తక్కువేం తినలేదు. తాజాగా వచ్చిన సైరా నరసింహారెడ్డి మూవీలో ఎద్దుల సన్నివేశంలో వాటిని గుర్రంపై వచ్చి కాపాడే సన్నివేశం ఫాన్స్ మదిలో చెరగని ముద్రవేసింది. గుర్రమెక్కి చీల్చి చెండాడే నటనతో చిరంజీవి తారాస్థాయికి చేరాడు. చిరుకి గుర్రం కొత్తకాదు. ఈవీవీ దర్శకత్వంలో వచ్చిన అల్లుడా మజాకా మూవీలో చిరంజీవి గుర్రంపై ఫైట్,ముఖ్యంగా రోడ్డుపై పోలీసులను తప్పించుకు వెళ్తూ అడ్డుగా వచ్చిన కంటైనర్ కిందినుంచి వెళ్లడం అప్పట్లో సంచలనంగా నిల్చింది.

అలాగే ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ గా నిల్చిన కొండవీటి దొంగ,కొదమ సింహం మూవీస్ లో హార్స్ రైడింగ్ తో చిరంజీవి అలరించాడు. ఇప్పటి హీరోల్లో ప్రభాస్ బాహుబలి మూవీలో హార్స్ రైడింగ్ ఒక హైలెట్ గా నిల్చింది. భీభత్స పోరాట సన్నివేశాల్లో గుర్రాలే ప్రధాన భూమిక వహించాయి. ప్రభాస్,రానాల గుర్రం మీద ఫైట్ సన్నివేశాలు సినీ చరిత్రలో సువర్ణాధ్యాయం గా నిలిచాయి. రాజమౌళి డైరెక్షన్ లోనే వచ్చిన రామ్ చరణ్ మగధీర మూవీలో హార్స్ రైడింగ్ ఆడియన్స్ ని ఆకట్టుకుని,తండ్రిని మించిన తనయుడిగా నిలిచాడు.

గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన రుద్రమ దేవి మూవీలో గుర్రాలే గుర్రాలు. అనుష్క,రానా,అల్లు అర్జున్ హార్స్ రైడింగ్ ఆడియన్స్ కి వింత అనుభూతి కల్గించాయి. రేసు గుర్రం పేరిట సినిమా డిజైన్ చేసి హార్స్ రైడింగ్ తో బన్నీని కొత్తగా చూపించడంలో డైరెక్టర్ సురేంద్ర రెడ్డి సక్సెస్ అందుకున్నాడు. కమర్షియల్ మూవీ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ హార్స్ రైడింగ్ కొత్త అనుభూతిలోకి తీసుకెళ్లింది. రామయ్య వస్తావయ్యా మూవీలో గుర్రపు స్వారీతో జూనియర్ ఎన్టీఆర్ అలరించాడు. విన్నర్ మూవీలో సాయి ధర్మ తేజ్ హై రేంజ్ హార్స్ రైడింగ్ తో ఆకట్టుకున్నాడు.

error: Content is protected !!