ఈ చిట్కాతో ఎలాంటి స్ట్రెచ్ మార్క్స్ అయినా ఇట్టే పోతాయి

స్ట్రెచ్ మార్క్స్.. మహిళలను ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఇది ఒకటి. అనేక కారణాలతో వచ్చే ఈ సమస్యని కొన్ని ఇంటి చిట్కాల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అవేంటో చూద్దాం.

ప్రసవం తర్వాత మహిళలకు స్ట్రెచ్ మార్క్స్ వస్తుంటాయి. అదే విధంగా బరువు పెరగడం, తగ్గడం కారణంగా కూడా ఈ మచ్చలు వస్తుంటాయి. కడుపు, భుజాలు, కాళ్లు ఇలా శరీర భాగాలపై వస్తుంటాయి. త్వరగా బరువు తగ్గడం, లేదా అంతే త్వరగా బరువు పెరగడం, ఒత్తిడి వంటి సమస్యల వల్ల ఇవి శరీర భాగాలపై ఏర్పడుతుంటాయి. వీటిని తగ్గించుకునేందుకు మార్కెట్లో దొరికే క్రీమ్స్, ఇతర ప్రత్యామ్నాయాలను ఆశ్రయించే బదులు కొన్ని ఇంటి చిట్కాల ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

చక్కెరని ఉపయోగించి స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవడం ఎలా..

చక్కెరని అందం కోసం బాగా ఉపయోగించొచ్చు. ఇందులోని ఎన్నో అద్భుత గుణాలు శరీరంపై ఏర్పడిన మచ్చలని సులువుగా పోగోడుతుంది. చక్కెరని ఆల్మండ్ ఆయిల్‌తో కలపాలి.. ఇందులో రెండు చుక్కల నిమ్మరసం వేయాలి. నూనెలో చక్కెర పూర్తిగా కరిగిపోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్ట్రెచ్‌ మార్క్స్ ఉన్న చోట రాయాలి. నెమ్మదిగా మర్దనా చేయాలి. రాసిన మిశ్రమం దాదాపు ఆరిపోయాక కడగడం, స్నానం చేయడం చేయాలి. ఇలా రెగ్యులర్‌గా నెల రోజుల పాటు చేస్తే సమస్య చాలా వరకూ తగ్గుతుంది. అయితే.. ఈ మిశ్రమంతో ఎక్కువగా రుద్దొద్దు.. సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం ఎలాంటి మచ్చలు అయినా తగ్గిపోతుంది.

error: Content is protected !!