పాపం నాగబాబు పరిస్థితి ఇలా అయిందే… భజన చేసినవాళ్ళే….???

గత రెండు వారాలుగా జబర్దస్త్ కామెడీ షో లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా నాగబాబు ఈటీవీని వదిలి జీతెలుగులోకి వెళ్లడం సంచలనంగా మారింది. ఆయనతో పాటు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది కూడా రావాలని అనుకున్నారని, కానీ మల్లెమాల ప్రొడక్షన్స్ అగ్రిమెంట్ పేరుతో వారిని అక్కడే బందించి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశాడు నాగబాబు.

ఇదిలా ఉంటె…. తాజా ఎపిసోడ్ లో మాజీ జడ్జి నాగబాబుపై అదిరిపోయే పంచ్ వేశాడు హైపర్ ఆది. తన స్కిట్ లో భాగంగా కంటెస్టెంట్స్ లతో డైలాగ్స్ చెప్పించి మరి నాగబాబుపై సెటైర్స్ వేయించాడు. అరేయ్ మనం ఎప్పుడు ఇలాగే కలసి ఉండాలిరా అంటే….వెంటనే హైపర్ ఆది ఏడేళ్లుగా కలసిన వారు విడిపోతున్నారు మూడేళ్లది బొక్క… మన రిలేషన్ ఎంత అంటూ అదిరిపోయే పంచ్ వేశాడు.

ఇక చలాకి చంటి కూడా తన స్థితిలో నాగబాబుపై అదిరిపోయే సెటైర్ వేశాడు. ఇక్కడ వేరే రాజు ఉండాలి కదా అంటూ ఒక కంటెస్టెంట్ అడిగితే ఆయనకు ఇక్కడ భోజన వసతులు బాగోలేవని వేరే రాజ్యానికి వెళ్ళిపోయాడు.. వెళుతూ వెళుతూ మాకు ఈ రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళాడు అంటూ నాగబాబుపై సెటైర్ వేశారు.

ఆయన ఉన్నప్పుడు ఆయన ముందు భజన చేసిన జబర్దస్త్ కమెడియన్స్ ఆయన వెళ్లిన తర్వాత నాగబాబు పైనే పంచులు వేస్తున్నారు. ఏదేమైనా కూడా నాగబాబు వెళ్ళిన తర్వాత కూడా జబర్దస్త్ కామెడీ షో రేటింగ్ అనేది అలాగే మెయింటైన్ కావడంతో మల్లెమాల ప్రొడక్షన్స్ హ్యాపీగా ఉంది.

error: Content is protected !!