టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ ఎవరో తెలుసా?

ఒక సినిమాలో పాటలు హిట్ అయ్యాయంటే, డాన్స్ ఎలా ఉంటుందో ఫాన్స్ ఊహించుకుంటారు. సీనియర్ లకు ఏమాత్రం తగ్గకుండా యంగ్ హీరోలు డాన్స్ లు ఇరగదీస్తున్నారు. డాన్స్ లతో కనక వర్షం కురిపిస్తున్నారు. ఆనాటి తరం నుంచి ఈతరం వరకూ డాన్స్ లలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క శైలి. అయితే అప్పటివరకు స్టెప్స్ లో అక్కినేని కొత్త వరవడి సృష్టిస్తే,మొత్తం ఇండస్ట్రీలోనే చిన్నపిల్లలు మొదలు పెద్దల వరకూ అందరినీ స్టెప్ లతో ఉర్రూతలూగించిన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి. ఈనాటివరకూ డాన్సర్లకు చిరు రోల్ మోడల్ గా నిలుస్తున్నారంటే అది మాములు విషయం కాదు.

అయితే చిరంజీవికి ధీటుగా స్టెప్స్ వేస్తూ తనకంటూ ఓ శైలి ఏర్పరచుకున్న నటుడు నందమూరి బాలయ్య. ఎందుకంటే అప్పట్లో బాలయ్య పాటలు ,డాన్స్ లు మాస్ కి కిక్కిచ్చేవి. అలాగే విక్టరీ వెంకటేష్,అక్కినేని నాగార్జున సైతం డాన్స్ లలో తమ శైలి కనబరిచారు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా డాన్స్ లో కొత్తదనం చూపిస్తూ ఎన్నో హిట్స్ అందుకున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్,సూపర్ స్టార్ మహేష్,స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్,మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఇలా అందరూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా స్టెప్స్ వేస్తూ తమ సత్తా చాటుతున్నారు.

కూచిపూడి నేర్చుకోవడం వలన జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ లలో పెర్ఫెక్ట్ కనిపిస్తుంది. యమదొంగ మూవీలో స్టెప్స్ సరికొత్తగా కనిపిస్తాయి. మేనమామ చిరంజీవికి రోల్ మోడల్ గా బన్నీ డాన్స్ లు ఇరగదీస్తాడు. చిరు నటించిన డాడీ సినిమాలో డాన్సర్ గా ఓ పాత్ర పోషించిన అల్లు అర్జున్ లోని డాన్స్ ఫెరఫార్మెన్స్ మెగా అభిమానులను ఆకట్టుకుంది. బద్రీనాధ్ మూవీకి పాటలు,డాన్స్ కి అవార్డులు వచ్చాయి. తాజాగా అల వైకుంఠపురం మూవీలో బన్నీ స్టైల్ విశేషంగా ఆకట్టుకుంటుందని భారీ అంచనాలున్నాయి.

తొలిసినిమా చిరుతతోనే అదిరిపోయే స్టెప్స్ తో రామ్ చరణ్ మెగా వారసుడిగా నిలిచాడు.సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న మహేష్ బాబు నట జీవితంలో బిగ్గెస్ట్ హిట్ పోకిరిలో డాన్స్ ఫాన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. డార్లింగ్ హీరో ప్రభాస్ నటనలోనే కాదు డాన్స్ లో కూడా తనదైన ముద్ర వేస్తున్నాడు. వరుణ్ తేజ్,కళ్యాణ్ రామ్ వంటి హీరోలు డాన్స్ లతో దుమ్మురేపుతున్నారు.

error: Content is protected !!