అలా వైకుంఠపురంలో చిత్రం ప్రీ రిలీజ్ వేడుక కు ముఖ్య అతిధి….త్రివిక్రమ్ పిలిస్తే రాకుండా ఉంటాడా?

అలా వైకుంఠపురంలో చిత్రానికి ఊహించని రేంజ్ లో పబ్లిసిటీ వచ్చిందని చెప్పాలి. థమన్ సంగీతం తెలుగు ప్రేక్షకుల్ని మాత్రమే కాకుండా సౌంత్ ఇండియా ప్రజలందరినీ ఆకట్టుకుంటుంది. అయితే తాజా సమాచారం ప్రకారం అలా వైకుంఠపురంలో చిత్రం ప్రీ రిలీజ్ వేడుక కు ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారిని ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారట. అయితే ఈ నెల 6 న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకని జరుపుకోనుంది.

అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ లు ఇద్దరూ ఒక స్టేజి పైనే కనిపిస్తే మెగా, పవర్ అభిమానులకు పండగే. అయితే ఈ చిత్ర వేడుకకి పవన్ తప్పకుండా వస్తారని చిత్ర యూనిట్ భావిస్తుంది. అయితే అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని జనవరి 10 న విడుదల చేసేందుకు పట్టుబట్టారని ఫిలిం నగర్ లో వార్త చెక్కర్లు కొడుతుంది. దీనిపై చిత్ర యూనిట్ ఇంకా స్పందించక పోగా, తాజాగా విడుదల చేసిన నూతన సంవత్సర పోస్టర్ లో ఎలాంటి తేదీని ప్రకటించలేదు. అయితే ఆ పుకారే నిజం కానుంది అని తెలుస్తుంది.

error: Content is protected !!