షాకింగ్ : ఎన్టీఆర్ కి ఏమైంది – ఎందుకిలా అయ్యాడు…? ఆందోళనలో అభిమానులు

తన నటనతో, నృత్యాలతో, ఫైట్లతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకొని తెలుగు పరిశ్రమలో అగ్ర హీరోల సరసన చేరిన ఎన్టీఆర్, అరవింద సమేత లాంటి విజయవంతమైన చిత్రం తరువాత, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం RRR లో అత్యంత కీలకమైన కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం కోసమని ఎన్టీఆర్ తన శరీరాకృతిని, తన లుక్ ని పూర్తిగా మార్చేసుకున్నారు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ ని చూస్తే తనకు ఏమైంది అనే సందేహాలు అభిమానులందరినీ కలవరపెడుతున్నాయి.

కాగా నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికని అభిమానులందరూ కూడా ఎన్టీఆర్ నివాసానికి చేరుకున్నారు. దీంతో ఆ అభిమానులు అందరిని పలకరించేందుకు ఎన్టీఆర్ తన ఇంటి మేడపైకి వచ్చి, తన అభిమానులందరికి అభివాదం చెప్తూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ సమయంలో ఒక అభిమాని తీసిన ఫోటోలు ప్రస్తుతానికి సామజిక మాంద్యమాల్లో వైరల్ గా మారాయి. ఎందుకంటే ఆ ఫొటోల్లో ఎన్టీఆర్ చాలా సన్నగా, పీక్కుపోయి ఉన్నాడు. ఈ ఫోటోలు చూసిన వారందరు కూడా ఎన్టీఆర్ కి ఏమైందని పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే RRR కోసమే తన శరీరాకృతిని ఇలా మార్చుకున్నాడని సమాచారం.

error: Content is protected !!