జామ ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

జామపండ్లతో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో… వాటి ఆకులలోనూ చాలా ప్రయోజనాలు దాగిఉన్నాయి. జామకాయలు, ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ c, పొటాషియం, ఫైబర్ లభిస్తాయి. అందుకే మనం జామకాయల్ని తినాలి, ఆకుల రసం తాగాలి. జామపండ్లను తింటే జలుబు వస్తుందని పెద్దవాళ్లు అంటుంటారు. అందువల్ల మరీ బాగా ముగ్గినవి కాకుండా దోరగా ఉన్నవి తింటే మేలు. మరి జామకాయల ఆకులతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

బ్లడ్ షుగర్‌ కంట్రోల్ : జామ పండ్ల ఆకుల రసం తాగితే… మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ క్రమపద్ధతికి చేరతాయి. చాలా ఎక్కువసేపు బ్లడ్ షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది. డయాబెటిస్ ఉండేవారికి ఇది ఎంతో మేలు చేసే అంశం. అందువల్ల భోజనం తర్వాత జామ ఆకుల టీ తాగితే కలిసొస్తుంది. దాదాపు రెండు గంటలపాటూ బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. ఓ నాలుగు జామ ఆకుల్ని నీటిలో పది నిమిషాలు ఉడికించి, ఆ నీటిని తాగేయడమే. ఈ నీరు రుచిగా ఉండకపోయినా… ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇలాగే తాగేయడం మేలు. మార్కెట్లలో జామ ఆకుల టీ ప్యాకెట్లు లభిస్తున్నాయి.

గుండెకు మేలు : జామ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు… విషవ్యర్థాలను చంపేసి… గుండెకు మేలు చేస్తాయి. జామకాయల్లోని పొటాషియం, కరిగిపోయే ఫైబర్… గుండెను కాపాడతాయి. జామ ఆకులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. హైబీపీ, చెడు కొలెస్ట్రాల్ వంటివి గుండె జబ్బులకు కారణమవుతాయి. అందువల్ల జామ ఆకుల రసం తాగాలి.

పీరియడ్స్ నొప్పులకు చెక్ : పీరియడ్స్ టైమ్‌లో చాలా మంది మహిళలు పొట్టలో నొప్పి వస్తున్నట్లు బాధపడతారు. జామ ఆకుల రసం ఈ నొప్పులను అదుపుచేస్తుంది. రోజూ ఈ రసం తీసుకుంటే మేలు జరుగుతుంది.

జీర్ణక్రియకు మేలు : జామకాయలు జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తాయి. ఎంత ఎక్కువగా జామకాయలు తింటే అంతగా జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకం పారిపోతుంది. ఒక జామకాయ… మన రోజువారీ అవసరమయ్యే ఫైబర్‌‌లో 12 శాతం ఇస్తుంది. జామ ఆకుల రసం కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. డయేరియా (విరేచనాలు)కి చెక్ పెడుతుంది.

అధిక బరువుకి చెక్ : జామకాయల్లో కేలరీలు తక్కువ. అందువల్ల ఇవి తింటే ఆకలి తీరుతుంది. అలాగే ఎక్కువ కేలరీలు బాడీకి చేరవు. పైగా వీటిలోని విటమిన్లు, మినరల్సూ మేలు చేస్తాయి.

error: Content is protected !!