జగపతిబాబు సినిమాల్లోకి వచ్చాక ఆస్థి సంపాదించాడా…లేదా…నిజాలు ఇవే…!

ఒకప్పుడు హీరోగా లేడీ ఫాన్స్ ఫాలోయింగ్ పుష్కలంగా సంపాదించుకున్న నటుడు జగపతి బాబు ఇప్పుడు విలన్ గా ,క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన సత్తా చాటుతున్నాడు. తెలుగు ,తమిళ భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించిన జగపతి బాబు సినీ నేపథ్యం నుంచే వచ్చాడు. ఇతని తండ్రి విబి రాజేంద్రప్రసాద్ జగపతి ఆర్ట్ పిక్చరర్స్ బ్యానర్ పై ఎన్నో చిత్రాలు తీయడమే కాకుండా డైరెక్షన్ కూడా చేసారు. ఎక్కువగా అక్కినేని తో ఈయన సినిమాలు తీశారు.

సింహ స్వప్నం మూవీతో 1989లో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు ఫ్యామిలీ ఓరియెంటెండ్ మూవీస్ లో నటించి ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. విలక్షణ నటుడిగా విభిన్న పాత్రల్లో ఒదిగిపోయాడు. యితడు నటించిన సినిమాలన్నీ దాదాపు విజయం సాధించాయి.

జగపతి బాబు ఏడాది సంపాదన ఎంత, మొత్తం ఆస్తి ఎంత వంటి విషయాల్లోకి ఒకసారి వెళ్తే,ఇతని ఆస్తి 250కోట్లు. చెన్నైలో 5కోట్లు విలువచేసే ఇల్లు,రెండు కోట్లు విలువ చేసే సూపర్ లగ్జరీ కారు మెయింటేన్ చేస్తున్నాడు. ఏడాదికి 20నుంచి 25కోట్లు సంపాదిస్తాడు. ఒక్కో సినిమాకు 5నుంచి 8కోట్లు పారితోషికం అందుకుంటాడట.

error: Content is protected !!