ఇంతకు సంక్రాంతి విన్నర్‌ ఎవరో తెలుసా?

సంక్రాంతికి నాలుగు సినిమాలు అంటూ మూడు నెలలుగా ప్రేక్షకులు ఎదురు చూశారు.అంతా ఎదురు చూసినట్లుగానే నాలుగు సినిమాలు దర్బార్‌తో మొదలు పెట్టి నిన్న వచ్చిన ఎంత మంచివాడివిరా చిత్రంతో సంక్రాంతి సీజన్‌ పూర్తి అయ్యింది.దర్బార్‌ చిత్రంకు పర్వాలేదు అనే టాక్‌ వచ్చింది.ఇక సరిలేరు నీకెవ్వరు మరియు అల వైకుంఠపురంలో సినిమాకు హిట్‌ టాక్‌ వచ్చింది.

ఇక ఎంత మంచి వాడవురా చిత్రంకు పర్వాలేదు అన్నట్లుగా టాక్‌ వచ్చింది.దర్బార్‌ చిత్రం డబ్బింగ్‌ అవ్వడంతో ప్రేక్షకులు లైట్‌ తీసుకున్నారు.సరిలేరు నీకెవ్వరు మరియు అల వైకుంఠపురంలో సినిమాల ముందు ఎంత మంచి వాడవురా చిత్రం నిలువలేక పోయింది.ముఖ్యంగా పోటీ అల వైకుంఠపురంలో మరియు సరిలేరు నీకెవ్వరు.ఈ రెండు సినిమాలు హోరా హోరీగా ఉన్నాయి.సరిలేరు నీకెవ్వరు చిత్రం కంటే అల వైకుంఠపురంలో సినిమా హిట్‌ అంటూ ప్రచారం చేస్తున్నారు.

అసలు విషయం ఏంటా అంటూ ప్రేక్షకులు జుట్టు పీక్కుంటున్నారు.టాక్‌ పరంగా చూస్తే అల వైకుంఠపురంలో సినిమాకు మంచి టాక్‌ ఉంది.అయితే కలెక్షన్స్‌ పరంగా చూస్తే మాత్రం సరిలేరు నీకెవ్వరు కూడా తక్కువేం లేదు.రెండు సినిమాల కలెక్షన్స్‌ నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నాయి.ఫైనల్‌గా అల వైకుంఠపురంలో సినిమాకు కాస్త ఎక్కువ కలెక్షన్స్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సంక్రాంతికి విన్నర్‌ ఎవరు అనేది వారం రోజులు అయిన తర్వాత వెళ్లడయ్యే అవకాశం ఉంది.

error: Content is protected !!