Devotional

ఏ వారం త‌ల‌స్నానం చేస్తే మంచిదో తెలుసా?

ఒక్కోవారం ఒక్కో దేవుడికి మ‌హిళ‌లు పూజ‌లు చేయ‌డం చూస్తునే ఉంటాం. అలానే త‌ల‌స్నానం కూడా ప్ర‌తీరోజు చేయ‌డం వ‌ల్ల కొన్ని ప్ర‌యోజ‌నాల‌తో పాటు కొన్ని తెలియ‌ని ఆటంకాలు సృష్టించుకున్న‌వారం అవుతాం. శనివారం రోజు జుట్టు కత్తిరించినట్లయితే..శని దేవుని సతి ప్రభావం తగ్గుతుందని కొందరి ప్ర‌ఘాడ నమ్మకం. గురువారం తలస్నానం చేయోద్దని…బట్టలు ఉతకొద్దని మహిళలు అంటుంటారు. మతపరంగా ఎక్కువ మంది మహిళలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. తలస్నానం గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. అవేంటో చూద్దామా.

సోమ‌వారం:
సోమ‌వారం త‌ల‌స్నానం చేయ‌డం వ‌లన ముఖ తేజ‌స్సు త‌గ్గ‌డంతో పాటు అన‌వ‌స‌ర భ‌యాలు ఆవ‌రిస్తాయి.

మంగ‌ళ‌వారం:
ఈ రోజుల్లో కూడా మన ఇండ్లల్లో ఎన్నో ఆచారాలను పాటిస్తున్నారు. మంగళవారం రోజు తలస్నానం చేయొద్దని పెద్దవాళ్లు చెబుతుంటారు. ఇది అనాదికాలంగా వస్తున్న ఓ నమ్మకం. మంగళవారం తలస్నానం చేస్తే మార్స్ ద్వారా ప్రభావితమైనవారికి మరింత వర్తిస్తుందట. అందుకే మంగళవారం తలస్నానం చేయడానికి ఎక్కువ మంది నిరాకరిస్తుంటారు. అంతేకాకుండా త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల అపాయం ఆయుక్షీణ‌మ్ క‌లుగుతుంతి. ఆడ‌వారు మంగ‌ళ‌వారం త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల‌న భ‌ర్త‌కు కూడా క‌లిసిరాదు.

బుధవారం:
బుధవారం తలస్నానం చేయొద్దని ఒక బాలుడి తల్లి చెబుతోంది. బుధవారం రోజు తలస్నానం చేస్తే…ఆమె పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటోంది. అంతేకాదు…కొత్త వివాహం అయిన స్త్రీ బుధవారం రోజు తలస్నానం చేస్తే పండంటి బిడ్డ కలుగుతాడని నమ్ముతారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు.

గురువారం:
గురువారం తలస్నానం చేసినట్లయితే ఆర్థిక నష్టాలు విపరీతంగా కలుగుతాయి. ఇంట్లో నుంచి లక్ష్మీ బయటకు వెళ్తుందనే ఒక అపోహ కూడా ఉంది. అంతేకాదు గురువారం రోజు ఒక మహిళ తలస్నానం చేస్తే ఎలాంటి పరిణామాలకు దారి తీసిందో తెలిపే కథలు చాలా ఉన్నాయి. గురువారం తలస్నానం చేసిన మహిళ క్రమంగా తన ఆస్తులను కోల్పోయిందట. అంతేకాదు గురువారం బట్టలు ఉతకడం కూడా అరిష్టమని భావిస్తారు.

శుక్ర‌వారం:
శుక్ర‌వారం త‌ల‌స్నానం చేస్తే అనారోగ్యం, ధ‌న‌వ‌స్తు న‌ష్టం క‌లుగుతాయ‌ట‌.

శనివారం:
శనివారం తలస్నానం చేస్తే మిశ్రమ ఫలితాలున్నాయని హిందూ పురాణాలు చెబుతున్నాయి. శనివారం తలస్నానం చేస్తే చాలా మంచిదట. సాడేసతి యొక్క ప్రభావాన్ని తగ్గించడంతోపాటు..మహాభోగములు కలిసి వస్తాయి. అయితే శనివారం రోజు మహిళలు కూడా తలస్నానం చేయడం బెట్టర్.

ఆదివారం:
ఆదివారం త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల తేజ‌స్సు అందం త‌గ్గుతుంది. మ‌న‌స్థాపం క‌లుగుతుంది. చెడువార్త‌లు వింటార‌ని శాస్ర్తాలు చెబుతున్నాయి.