మోక్షజ్ఞ విషయంలో బాలకృష్ణ సంచలన నిర్ణయం….కొడుకు తీరులో మార్పు వస్తుందా…???
టాలీవుడ్ లో అగ్ర హీరోల వారసులంతా ఇప్పటికే దాదాపు అంతా వచ్చేసారు. ఒక్కో ఫామిలీ నుంచి ఒకరిద్దరు కన్నా ఎక్కువే ఇండస్ట్రీకి వచ్చారు. మెగా ఫామిలీ అయితే డజనుమంది దాకా వచ్చేసారు. మరి నటసింహ బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఇంకా ఎంట్రీ ఇవ్వకుండా అలా మిగిలిపోయాడు. వాస్తవానికి మోక్షజ్ఞ డెబ్యూ సినిమా గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. బాలయ్య కూడా ఎప్పటికప్పుడు తనయుడి సినిమా గురించి చెబుతున్నా, కొడుకు మాత్రం ఆసక్తి కనిపించడం లేదు. ఎందుకంటే,నందమూరి మోక్షజ్ఞ అసలు నటనపై ఆసక్తి చూపించడం లేదనే వార్తలే ఫాన్స్ ని ఆందోళనలో పడేస్తున్నాయి.
అన్నీ అనుకున్నట్లు ఈ పాటికే మోక్షజ్ఞ ఇండస్ట్రీకి రావాల్సి ఉంది కానీ ఆయన మాత్రం నటనపై ఆసక్తి చూపించడం లేదనే వార్తలు రావడంతోనే ఇన్నాళ్ళూ ఆలస్యానికి కారణంగా టాక్. అయితే ఈ విషయంలో బాలయ్య మాత్రం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పుడు ప్రచారం సాగుతోంది. న్యూయార్క్లో ఉన్న లీ స్టార్స్ బర్గ్ ఫిలిం ఇన్ స్టిట్యూట్లో ఒక షార్ట్ టర్మ్ క్రాష్ కోర్స్ తీసుకోవడానికి అమెరికా వెళ్ళే విధంగా బాలయ్య మోక్షజ్ఞను ఒకే చెప్పించాడట. అక్కడికి వెళ్తే అయినా నటనపై ఆసక్తి కలుగుతుందని బాలయ్య నమ్మకంగా ఉందట.
అంతేకాదు అమెరిక నుంచి వచ్చిన తర్వాత తన సినిమా షూటింగ్కు కూడా కొడుకును తీసుకురావాలని బాలయ్య ప్లాన్ లో ఉన్నాడట. మొత్తానికి ఎలాగైనా కూడా మోక్షజ్ఞ మనసు మార్చేలా ప్రయత్నాలు చేస్తున్నాడు . తన కొడుకు కోసం భారీగానే లాంఛ్ ప్లాన్ చేస్తున్నా కూడా బాలయ్య మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అందుకే ఆఖరి ప్రయత్నంగా చేస్తున్న అమెరికా ఫిలిం ఇన్స్ట్యిట్యూట్ ప్రయోగం ప్లాన్ లో పెట్టాడని బాలయ్య సన్నిహితుల టాక్.