పవన్ వద్దంటే రామ్ ఓకే అన్నాడు…ఆ సినిమా ఏమిటో తెలుసా?

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా నిలవడంతో రామ్ చాలా ఏళ్ల తరువాత అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు.కాగా ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో రామ్ తన నెక్ట్స్ మూవీని రెడీ
చేస్తున్నాడు.

తమిళ సూపర్ హిట్ చిత్రం ‘తడం’ను తెలుగులో రెడ్ అనే పేరుతో రామ్ తెరకెక్కిస్తున్నాడు.పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కతుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక తన నెక్ట్స్ మూవీని కూడా అప్పుడే ఓకే చాశాడట రామ్.డైరెక్టర్ బాబీ చెప్పిన ఓ కథ రామ్‌కు తెగ నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడట.అయితే గతంలో ఈ కథను బాబీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వినిపించాడట.

రాజకీయాల్లో బిజీగా ఉండటంతో పవన్ ఈ సినిమాకు నో చెప్పాడట.కాగా ఈ కథను రామ్‌కు వినిపించగా వెంటనే ఓకే చెప్పేయడంతో ఈ సినిమాను రెడీ చేసేందుకు బాబీ సిద్ధమవుతున్నాడు.ఇక రామ్ నటిస్తున్న రెడ్ సినిమాను కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తుండగా స్రవంతి రవికిషోర్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

error: Content is protected !!