Movies

యాంకరింగ్ లో సుమ కనకాల బాధలెన్నో తెలుసా…ఎవరికీ తెలియని నిజాలు

యాంకరింగ్ వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చేసాయి. అయితే తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ అనే మాట వినిపిస్తే చాలు, ముందుగా సుమ కనకాల పేరు గుర్తొస్తుంది. ఆమె మాటల తుఫాన్ ముందు ఏ యాంకర్ కనీసం నిలబడటం లేదు. అలాంటిది ఆమెకు యాంకరింగ్ బాధలు ఎన్నో ఉన్నాయట. ఎవరి బాధలు వారివి అన్నట్లు చెప్పుకోలేకపోతోందట. అందరికీ కూర్చోబెట్టి కోచింగ్ ఇచ్చేంత అనుభవం ఉంది.. పైగా దశాబ్ధానికి పైగా ఇదే ఫీల్డులో ఉంది కానీ నిజంగానే సుమ మాత్రం యాంకరింగ్‌లో చాలా తంటాలు పడింది.

సుమ విషయంలో ఈ మాట నమ్మడానికి కష్టంగా అనిపించినా ఇదే నిజం. అయితే ఇప్పుడు మాత్రం కాదు. కెరీర్ కొత్తలో సుమ చాలా కష్టపడిందట. యాంకరింగ్ అనే పదానికి నిదర్శనంగా ఉండే సుమ తన కెరీర్ ప్రారంభంలో ఎన్ని బాధలు పడిందో.. తన ప్రయాణం ఎలా నడిచిందో అభిమానులతో ఇటీవల పంచుకుంది.అసలు తాను కెరీర్ మొద‌లు పెట్టిన‌ప్పుడు యాంక‌రింగ్ అనే ప‌ద‌మే లేద‌ని చెప్పింది. అప్పట్లో యాంకర్స్‌ను అనౌన్స‌ర్స్ అని పిలిచేవారని చెప్పుకొచ్చింది.

అనౌన్స్ చేస్తారు కాబట్టి అనౌన్సర్స్ అని పిలిచే వాళ్లని, అలాంటి పదం మాత్రమే ఉండేదని స్టార్ యాంకర్ సుమ చెప్పింది. సుమ ఇప్పుడంటే అన్ని ఛానెల్స్‌లో కనిపిస్తుంది కానీ అప్పట్లో దూర‌ద‌ర్శ‌న్‌లో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసింది సుమ. అప్పుడు మాత్రం ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్లు ‘ఇక్క‌డ మాట్లాడాల‌మ్మా’ అని మాత్ర‌మే చెప్పేవాళ్లు.. అలా సుమ వాళ్ల మాటలను ఫాలో అయిపోయేదాన్నని చెప్పింది. తనకు ఫ‌లానా వ్య‌క్తి యాంక‌రింగ్‌లో స్ఫూర్తి అని లేరని క్లారిటీ ఇచ్చింది