ఈ హీరోని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?

హ్యాపీ డేస్ సినిమాతో ఏకంగా నలుగురు కుర్ర హీరోలు వెలుగులోకి వచ్చారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో టైసన్ అనే యువ హీరో కూడా ఉన్నాడని తెలుసు కదా. ఇతడి అసలు పేరు రాహుల్ దయా కిరణ్. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ దయాకర్ కెరీర్ మాత్రం ముందుకు సాగలేదు. నిజామాబాద్ లో రాహుల్ పుట్టాడు. అతడి తండ్రి బిజినెస్ మాన్. రాహుల్ కి సిస్టర్ రూతూ వుంది. ఇద్దరు కవలలు కావడం విశేషం.

గ్రాడుయేషన్ చేస్తున్న సమయంలో 2007లో హ్యాపీ డేస్ మూవీ ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యాడు. ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాహుల్ ఈ 13ఏళ్లలో కేవలం 7సినిమాలు మాత్రమే చేసాడు. రెయిన్ బో,ముగ్గురు,ప్రేమ ఒక మైకమా ,మ్యూజిక్ మ్యాజిక్ ,లవ్ యు బంగారం, వెంకటాపురం సినిమాలో నటించాడు.

వెంకటాపురం మూవీలో సిక్స్ ప్యాక్ లో నటించిన రాహుల్ కి విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. అయితే ఆతర్వాత సినిమా చేయాలని అతడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. 2015లోనే పెళ్లిచేసుకున్న రాహుల్ కి యోగ్య అనే పాప ఉంది. ప్రస్తుతం తాతలనాటి కాలం నుంచి వస్తున్న బిజినెస్ నడుపుతూ,బాడీ ఫిట్నెస్ పాటిస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉంటాడు.

error: Content is protected !!