జయసుధ పక్కన నెరిసిన జుట్టుతో ఉన్న హీరోని గుర్తు పట్టారా…?

పండంటి కాపురం మూవీతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చి, ఎన్నో వందల సినిమాల్లో నటించి మెప్పించిన సహజనటి జయసుధ రాజకీయాల్లోను ముద్ర వేసింది. తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ జయసుధ సత్తా చాటింది. 1985లో నితిన్ కపూర్ ని పెళ్లాడిన జయసుధకు ఇద్దరు మగపిల్లలు. భర్త నితిన్ ఆమధ్య ఆత్మహత్య చేసుకోగా, కుంగిపోయిన జయసుధ తేరుకుని,ఇద్దరిపిల్లల బాధ్యతలను నెరవేరుస్తోంది. 1986లో పెద్ద కొడుకు నీహార్,1990లో రెండో కొడుకు శ్రేయంత్ పుట్టాడు.

దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవతో 2009లో కాంగ్రెస్ లో చేరిన జయసుధ సికింద్రాబాద్ నుంచి పోటీచేసి గెలిచింది. ఇప్పుడు రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటున్న ఈమె పెద్ద కొడుకు నీహార్ కి పెళ్లి బాధ్యతలు చూస్తోంది. ఫిబ్రవరి 26న ఢిల్లీకి చెందిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ని నీహార్ పెళ్లి చేసుకోబోతున్నాడు. సీఎం జగన్,టిడిపి అదినేత చంద్రబాబు,ఇతర సినీ రాజకీయ ప్రముఖుల దగ్గరకు వెళ్లి పెళ్లి ఆహ్వానాలు అందిస్తూ వస్తున్నారు.

అయితే ఈ సందర్బంగా జయసుధ పక్కన ఓ వ్యక్తిని ఎక్కడో చూసినట్టు ఉందని అందరూ అనుకుంటున్నారు. ఇంతకీ అతనెవరంటే,బస్తీ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన జయసుధ రెండో కొడుకు శ్రేయాన్ కపూర్. ఇతడిని హీరోగా నిలబెట్టడానికి ఆస్తులన్నీ అమ్మి,సినిమా తీస్తే అదికాస్తా ప్లాప్ అయింది. మళ్ళీ హీరోగా వస్తాడులే అనుకుంటుంటే అతడి తీరు చూస్తే జుట్టు నెరసిపోయి ముసలి వాటం కనిపిస్తోంది. సినిమాలపై ఆశలు వదిలేసుకున్నాడా అనిపిస్తోంది. మొత్తానికి జయసుధ వారసత్వం ఇక లేనట్టేనా..

error: Content is protected !!