రాజమౌళి సినిమాల్లో వచ్చాక ఎంత సంపాదించాడో తెలుసా? హీరోలకు మించి…!

ఓటమి ఎరుగని దర్శక ధీరునిగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని వరల్డ్ వైడ్ కి తీసుకెళ్లిన ఎస్ ఎస్ రాజమౌళి పక్కా ప్లాన్ తో మూవీ స్టార్ట్ చేస్తాడు. షూటింగ్,రిలీజ్ డేట్ అన్నీ పక్కాగానే ఉంటాయి. అందరి హీరోలకు డ్రీమ్ డైరెక్టర్ ఇతడే. ఇతడి ఆలోచన శక్తి,తెలివితేటలే ఇతడికి నిజమైన ఆస్తిగా చెబుతారు. అందుకే ఓ చిన్న ఈగను పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టాడు.

రాజమౌళి ఇప్పటివరకూ 11సినిమాలు చేయగా,అన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఇక బాహుబలితో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లాడు. బాహుబలి రెండు పార్టీలు ఒకదాన్ని మించి ఒకటి అన్నట్లు ఉన్నాయి. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కూడా టాప్ రేంజ్ లో ఉన్నాయి. అందుకే ఏ సినిమా అయినా నాన్ బాహుబలి రికార్డ్స్ గానే మిగిలిపోతూ వస్తోంది.

ఇంతగా పాపులార్టీ గల జక్కన్న ఆస్తి ఎంతో,ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటాడు వంటి విషయాల్లోకి వెళ్తే,టోటల్ నెట్ వర్త్ 84కోట్లు. ఒక్కో సినిమాకు 18కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ఐదు కోట్లు విలువచేసే అధునాతన సౌకర్యాల ఇల్లు,రెండు కోట్లు విలువ చేసే రెండు సూపర్ లగ్జరీన్ కార్లు ఉన్నాయి.

error: Content is protected !!