Movies

సంక్రాంతి తర్వాత సినిమాల నష్టాల జాబితా ఇదే..!

నిజంగా ఈ 2020 కొత్త సంవత్సరం ఆదిలోనే అదిరిపోయే సినిమాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.కంటెంట్ పరంగా మరియు టేకింగ్ లతో ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాలకు ఒకటి రెండు మినహా మంచి టాక్ ను సంతరించుకున్నాయి.కానీ సంక్రాంతి కానుకగా విడుదల కాబడిన రెండు చిత్రాలు మినహా మిగతా అన్ని చిత్రాలు కూడా భారీ నష్టాలు మిగిల్చాయి అని ట్రెడ్ వర్గాలు చెప్తున్నాయి.

సంక్రాంతి కానుకగా విడుదల కాబడిన “ఎంత మంచివాడవురా” నుంచి ఇటీవలే విడుదలైన “వరల్డ్ ఫేమస్ లవర్” వరకు అన్ని చిత్రాలు కూడా అన్ని నష్టాలనే మిగిల్చాయి.మొదటగా కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా 9న్నర కోట్ల వరకు బిజినెస్ చెయ్యగా 10 కోట్ల టార్గెట్ తో విడుదలైన ఈ చిత్రం 7 కోట్లను కూడా రాబట్టలేక ప్లాప్ అయ్యిపోయింది.అలాగే నాగశౌర్య నటించిన “అశ్వథ్థామ”కు మంచి టాక్ వచ్చి మాస్ ఎలిమెంట్స్ తో ఉన్నా సరే దాదాపు 7 కోట్ల టార్గెట్ ను రీచ్ అవ్వలేక ఒక కోటిన్నర వరకు నష్టాలతో ఆగిపోయింది.

ఇక ముఖ్యంగా మూడు సినిమాలు ఉన్నాయి.వాటిలో మొదటగా రవితేజ నటించిన “డిస్కో రాజా” మంచి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా విడుదలైన ఈ చిత్రం దాదాపు 20 కోట్లు బిజినెస్ చెయ్యగా దీనికి కేవలం 7.9 కోట్ల షేర్ మాత్రమే వసూలు అయ్యింది.దీనితో ఈ చిత్రం 12 కోట్ల మేర నష్టపోయింది.ఇంకా అలాగే సమంత మరియు శర్వాలు నటించిన “జాను”కు అయితే మామూలు దెబ్బ కాదని చెప్పాలి ఎన్నో అంచనాలతో ఈ చిత్రం కూడా 19 కోట్ల టార్గెట్ తో రాగా..

అప్పటికే ఈ సినిమా చాలా మందికి తెలిసి ఉండడం ఒరిజినాలిటీను ఇష్టపడే వారు కూడా ఎక్కువగా ఆసక్తి చూపకపోవడంతో కేవలం 8.5 కోట్ల షేర్ దగ్గరే ఆగిపోతుంది అని తెలుస్తుంది దీనితో ఈ చిత్రానికి పదిన్నర కోట్లు నష్టం..ఇంకా ఫైనల్ గా విజయ్ దేవరకొండ నటించిన “వరల్డ్ ఫేమస్ లవర్” అయితే వీటన్నిటిని మించే బిజినెస్ జరుపుకొని వీటన్నికంటే ఎక్కువ నష్టాలనే మిగల్చడం ఖాయమని తెలుస్తుంది ఈ చిత్రానికి 31 కోట్ల బిజినెస్ కాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో 10 కోట్లు కూడా కష్టమే అని తెలుస్తుంది.దీనితో 20 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.