వేసవికి సై అంటున్న సినిమాలు..ప్రేక్షకులకు పండగే

మన తెలుగులో ఈ వేసవికి బడా హీరోల సినిమాలు పెద్ద సంఖ్యలోనే రిలీజ్ అవుతున్నాయి. అందులో పెద్ద సినిమాలు..వఖీల్ సాబ్ తో పవన్ కళ్యాణ్, వీరప్ప తో విక్టరీ వెంకటేష్ మరియు వీ తో నాని..వీరికి ఏమాత్రం తీసిపోని కుర్ర హీరోలు అరణ్య తో రానా, సోలో బ్రతుకు సో బెటర్ తో సాయి ధర్మ తేజ్, లవ్ స్టోరీ తో నాగ చైతన్య… ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు.

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలకి సిద్ధమ్మయారు అన్న సంగతి తెలిసిందే..ఈయన వఖీల్ సాబ్ సినిమా వేసవిలో తమ ఫ్యాన్స్ ముందుకు రాబోతుంది. పవన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..చాల రోజుల తరువాత సినిమా తీయటం..అది వేసవిలో రిలీజ్ అవటంతో..కచ్చితంగా హిట్ పడుతుంది అనే వార్తలు చాలా వినిపిస్తున్నాయి.

విక్టరీ వెంకటేష్ ‘ఎఫ్ 2’ మరియు ‘వెంకీమామ’ సినిమాలు ప్రేక్షకులని బాగా అలరించాయి. ఇప్పుడు వెంకటేష్ నటిస్తున్న విర్రప్ప కథ చారిత్రాత్మకంగా ఉండబోతుంది అని తెలుస్తుంది. వెంకటేష్ లోని కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూస్తాం అంటున్నారు సినీప్రముఖులు.

సినీఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దీ రోజులోనే న్యాచురల్ స్టార్ అనే పేరుని సంపాదించుకున్న హీరో నాని కూడా తన సినిమాతో సై అంటున్నాడు.తక్కువ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయి ధర్మ తేజ్ కూడా సోలో బ్రతుకు సో బెటర్ సినిమాతో తన ఫ్యాన్స్ ని ఖుషి చేయటానికి చాల కష్టపడుతున్నాడు అనే విషయం తెలుస్తుంది. ‘మజిలీ’ మరియు ‘వెంకీమామ’ లాంటి హిట్ సినిమాలు చేసిన హీరో నాగ చైతన్య ఇప్పుడు మళ్ళీ ఇంకో రొమాంటిక్ ఫిలింతో సిద్ధం అవుతున్నాడు.

ఇవన్నీ ఇలా ఉంటె బాహుబలి సినిమాతో అన్ని భాషల ప్రజలను ఆకట్టుకున్న రానా దగ్గుబాటి ఇప్పుడు అరణ్య సినిమాతో తెలుగు, తమిళ, హిందీ భాషలలో చిత్రాన్ని రిలీజ్ చేయటానికి సన్నద్ధం అవుతున్నాడు.ఇవన్నీ ఒక ఎత్తు అయితే కెజీయఫ్2, పాన్ ఇండియా మూవీ గా తెరకేక్కుతుంది. కెజీయఫ్1 ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసింది. దీనికి సీక్వల్ గా రెండొవ భాగం విడుదల అవుతుంది.

ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేయటానికి హీరోలు వచ్చేస్తున్నారు. ఒక సినిమాని మించి మరొకటి ఉండబోతుంది కాబట్టి ఈ వేసవంతా ప్రేక్షకులకు పండగే.

error: Content is protected !!