పవన్ ఒకే సీన్ రెండు సినిమాలకు చేస్తున్నారా…?

టాలీవుడ్ లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఒకపక్క రాజకీయాలు మరోపక్క సినిమాలను ఏకకాలంలో చెయ్యగలిగే సత్తా ఉన్నవాడిని ఖచ్చితంగా పవన్ జోడు గుర్రాల సవారి చేసి రెండిటిని బ్యాలన్స్ చెయ్యగలడని ఎప్పుడో అన్నారు.ఇప్పుడు సరిగ్గా పవన్ అదే మాటలను నిజం చేస్తూ అదే రీతిలో రెండూ చేస్తున్నారు.

ప్రస్తుతం పవన్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.మొదటగా “వకీల్ సాబ్” చిత్రాన్ని పూర్తి చేస్తూనే మరోపక్క విలక్షణ దర్శకుడు క్రిష్ తో “విరూపాక్ష”లో కూడా బిజీగా ఉన్నారు.అయితే ఈ రెండు చిత్రాలకు సంబంధించి ఒకే సీక్వెన్స్ జరుగుతున్నట్టు సమాచారం.

ఒక పక్క వకీల్ సాబ్ కోసం హైదరాబద్ గచ్చిబౌలి అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో ఒక ఫైట్ సీన్ లో పాల్గొననుండగా మరోపక్క క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ థ్రిల్లర్ విరూపాక్షలో కూడా ఒక భారీ పోరాట సన్నివేశంలో పవన్ పాల్గొననున్నారని తెలుస్తుంది.

అయితే ఇది ఓ పాటకు సంబంధించిందా లేక ఫైట్ సీక్వెన్స్ దా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు కానీ దానికి సంబంధించిన సెట్ ఫోటోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.ఈ ఫోటోలు చూస్తుంటే పవన్ తో గట్టి సీనే ప్లాన్ చేసినట్టున్నారని చెప్పాలి.

error: Content is protected !!