పవన్ కళ్యాణ్ సినిమాకి ఎంత బడ్జెట్ అయినా తక్కువే…?

ప్రస్తుతానికి అటు రాష్ట్ర రాజకీయాలతో పాటు వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ తాజాగా వకీల్ సాబ్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నారు దర్శకనిర్మాతలు… అయితే ఈ చిత్రానికి సంబందించిన చిత్రీకరణ ఇంకా పూర్తవకముందే, పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో మునిగిపోయారు. కాగా క్రిష్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి సంబందించిన పనులన్నీ కూడా పూర్తి చేస్తున్నారు.

ఏ.ఎం. రత్నం నిర్మాణ సారథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం మొఘల్ చక్రవర్తుల పాలనా కాలం నాటి పీరియాడిక్ కథ తో తెరకెక్కించనున్నారు దర్శకుడు క్రిష్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక బందిపోటుగా కనిపించనున్నారు. అందుకనే అప్పటి నేటివిటీ కి తగ్గట్టుగా, బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా ఆనాటి సెట్స్ ని, అందాలను భారీగా నిర్మిస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్ కెరీర్లోని తొలి చారిత్రాత్మక చిత్రం కావడంతో భారీగా తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. అంతేకాకుండా ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రం కూడా.

error: Content is protected !!