ప్రదీప్ ను గురుదక్షిణగా ఇచ్చేసిన పవన్..ఎవరికీ?ఎందుకు??

ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే పలు ఎంటర్టైనింగ్ షోలలో ఆలీ వ్యాఖ్యాతగా చేసే “ఆలీతో సరదాగా” షో కూడా ఒకటి.అలా ప్రతీ సోమవారం టెలికాస్ట్ అయ్యే ఈ షోకు ప్రత్యేక అతిధిగా తెలుగు స్మాల్ స్క్రీన్ మోస్ట్ ఎనర్జటిక్ యాంకర్ ప్రదీప్ వచ్చాడు.ప్రస్తుతం తాను నటించిన “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?” అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వచ్చిన ప్రదీప్ నుంచి ఆలీ చాలా విషయాలే రాబట్టేసేలా ఉన్నారని చెప్పాలి.ప్రదీప్ మొట్ట మొదటి గర్ల్ ఫ్రెండ్ నుంచి తన పెళ్లి విషయం వరకు తాను చిన్నప్పుడు చేసిన అల్లర్లు గురుంచి ప్రతీ విషయాన్నీ ఆలీ రాబట్టేలా ప్రశ్నలు కురిపించారు.అలా ప్రదీప్ కు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మధ్య జరిగిన చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ను తెలిపారు.

అత్తారింటికి దారేది సమయంలో పవన్ కు బాగా డాన్స్ కొరియోగ్రఫీ చేసిన శివ శంకర్ మాస్టర్ తో మాట్లాడినపుడు తనకి అంత బాగా డాన్స్ నేర్పించినందుకు మీకు గురు దక్షిణ ఇవ్వాలనుకుంటున్నానని అంటూ పక్కనే ఉన్న ప్రదీప్ ను చూపించి ఈ అబ్బాయిని గురు దక్షిణగా మీకు ఇచ్చేస్తున్నాను తీసుకోండి అంటూ అనేసారని ప్రదీప్ నవ్వుతు ఆ ఘటన కోసం అసలు విషయం చెప్పాడు.ఇలా ఇంకెన్ని విషయాలను ప్రదీప్ పంచుకున్నారో తెలియాలి అంటే వచ్చే మార్చ్ 16 సోమవారం రాత్రి మీ ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే “ఆలీతో సరదాగా” షోను మిస్సవ్వకుండా చూడాల్సిందే.

error: Content is protected !!