కరోనా ఎఫెక్ట్ – నిన్నటి వరకు రూ. 50 ఉన్నది ఇప్పుడు రూ. 500 అయ్యింది

కరోనాకు ఇప్పటి వరకు మందు కనిపెట్టలేదు.అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు కూడా కరోనాకు ఇంకా మందు లేదు, ముందస్తు జాగ్రత్తలు పాటించండి అంటూ ప్రచారం చేస్తున్నారు.మన దేశ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందస్తు జాగ్రత్తలు పాటించండి అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.ఇలాంంటి సమయంలో కొందరు మాత్రం కరోనాకు మంచి మందు గో మూత్రం అంటూ ప్రచారం చేస్తున్నారు.

గో మూత్రం సర్వరోగ నివారణి అంటూ హిందూ మహాసభల అధ్యక్షుడు చక్రపాణి మహారాజ్‌ గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే.ఆయన ఇటీవల దిల్లీలో గో మూత్ర పార్టీ అంటూ కూడా ఇచ్చాడు.ఆ పార్టీకి మంచి స్పందన దక్కింది.ఇంకా పలు ప్రాంతాల్లో కూడా గో మూత్ర పార్టీలు జరుపుతున్నారు.

ఇదే సమయంలో మార్కెట్‌లో గో మూత్రంకు మంచి డిమాండ్‌ ఏర్పడినట్లుగా ప్రచారం జరుగుతోంది.మొన్నటి వరకు కొన్ని ఆయుర్వేదిక్‌ స్టాల్స్‌లో గో మూత్రంను 25 నుండి 50 రూపాయల చొప్పున బాటిల్స్‌లో అమ్ముతూ ఉండేవారు.కాని ఎప్పుడైతే ఈ ప్రచారం మొదలైందో అప్పటి నుండి కూడా గో మూత్రం ధర అమాంతం పెరిగి పోయిందట.

గో మూత్రంను ఉత్తర భారతదేశంకు చెందిన హిందూ సమాజం చాలా ఎక్కువగా వాడుతున్నారని, అక్కడున్న డిమాండ్‌ నేపథ్యంలో లీటరు ఏకంగా 500 రూపాయల వరకు పెరిగినట్లుగా చెబుతున్నారు.బహిరంగ మార్కెట్‌లో గో మూత్రం లభించడం లేదని, గో మూత్రంను కొందరు బ్లాక్‌ లో కూడా అమ్ముతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.గో మూత్రం 500 రూపాయల ధర పలుకుతుండగా, గోవు పాలు లీటరుకు 150 రూపాయల వరకు పలుకుతున్నట్లుగా తెలుస్తోంది.కరోనా కారణంగా గో మూత్రం గోవు పాలకు ఈ స్థాయిలో డిమాండ్‌ పెరగడం ఆశ్చర్యకర విషయం.

error: Content is protected !!