ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. విజయవాడ వాసికి కరోనా పాజిటివ్..!

ఏపీలో కరోనా కేసులు నెమ్మది నెమ్మదిగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాలో ఒక్కో కేసు నమోదైనట్టు ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే లండన్ నుంచి ఈ నెల 18న హైదరబాద్‌కి చేరుకున్న 22 ఏళ్ళ యువకుడు మొన్న 20వ తేదిన రాజమహేంద్రవరం వచ్చాడు. అయితే అతడికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అనట్టు తేలింది.

అయితే ఇక మరోపక్క పారిస్‌లో ఎమ్మెస్సీ చదువుతున్న 24 ఏళ్ళ యువకుడు ఈ నెల 15 న ఢిల్లీ వచ్చాడు. ఆ తరువాత 17న విజయవాడకు చేరుకున్న ఆ యువకుడికి 20వ తేదిన ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఆ యువకుడు విజయవాడలో వన్‌టౌన్‌లో నివాసం ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ యువకులు ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

error: Content is protected !!