Movies

ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరో రియల్ లైఫ్ ఇదే

ఓ ప్రముఖ ఛానల్ లో ప్రతిరోజూ రాత్రి 9గంటలకు ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ పొందుతోంది. 40ఏళ్ళ వయస్సులో గల తను19సంవత్సరాల వయస్సు గల అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు. వీరిద్దరి ప్రేమ ,పెళ్లి వ్యవరంతో వీళ్ళ జీవితం ఎలా ఉంటుందన్న అంశంతో ఈ సీరియల్ స్టార్ట్ అయింది.

ఇక ఈ సీరియల్ హీరో శ్రీరామ్ వెంకట్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటని పరిశీలిస్తే, అమలా పురంలో 1976జూన్ 19న జన్మించాడు. ఇతడి చదువు కూడా అక్కడే అయింది. గ్రాడ్యుయేషన్ అయ్యాక నటనపై ఆసక్తితో హైదరాబద్ వచ్చాడు. డిడి లో ప్రసారమైన ఓ సీరియల్ లో యాక్ట్ చేసి తన కెరీర్ స్టార్ట్ చేసాడు.

ఈటీవీలో ప్రసారమైన విధి సీరియల్ తో మంచి గుర్తింపు పొందిన శ్రీరామ్ ఆతర్వాత ఎగిరే పావురమా,రాధ కళ్యాణం వంటి సీరియల్స్ లో నటించాడు. ఓ వైపు సీరియల్స్ చేస్తూ మరోవైపు సినిమాల్లో చేసాడు. ప్రొడ్యూసర్ గా మారి వరూధిని పరిణయం,కొంచెం ఇష్టం కొంచెం కష్టం,అలాగే ఇప్పుడు ప్రసారమయ్యే కల్యాణ వైభోగం సీరియల్ కి ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు కానీ, ఎప్పుడు ఫ్యామిలీ ఫొటోస్ ని షేర్ చేసుకోలేదు. ఇతడికి పెళ్లయింది. ఒక కొడుకు ఉన్నాడు.