ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు.. విశాఖలో కలకలం..!

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. తాజాగా విశాఖలో మరో పాజిటివ్ కేసు నమోదు అయింది. ఇటీవల ఇంగ్లాండ్ నుంచి వచ్చిన 25 ఏళ్ళ యువకుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఆ యువకుడుకి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది.

కాగా ఈ కేసు విశాఖలో రెండవది కావడంతో విశాఖ వాసులలో ఇప్పటికే తీవ్ర కలవరం మొదలయ్యింది. ఈ కేసుతో ఏపీలో మొత్తం 7 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, సోమవారం ఒక్కరోజే కరోనా లక్షణాలతో 15 మంది ఆసుపత్రిలో చేరారు. అయితే వారందరి శాంపిల్స్‌ని పుణే ల్యాబ్‌కి పంపారు.

error: Content is protected !!