తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్కరోజే ఆరు పాజిటివ్ కేసులు..!

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా కరోనా కేసుల సంఖ్య పెరగడం మాత్రం ఆగడంలేదు. తాజాగా నిన్న ఒక్కరోజే ఆరు కేసులు నమోదు కావడం తీవ్ర విస్మయానికి గురిచేసింది.

ఈ నేపధ్యంలో రాష్ట్రంలో కేసుల సంఖ్య 33కు చేరుకుంది. అయితే ఇందులో ఒకరు కోలుకొని డిశ్చార్జి కాగా మరో 32 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే మొన్నటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారిలో మాత్రమే ఈ వైరస్ నిర్ధారణ కాగా, తాజాగా తెలంగాణ స్థానికులకు కూడా వచ్చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడు కాంటాక్ట్ కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో ప్రజలు వారం రోజుల పాటు ఇళ్లకే పరిమితం కావాలని, లాక్‌డౌన్ తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం కోరింది.

error: Content is protected !!