ఆచార్య లో ఆ పాత్ర కు పవన్ ని ఎందుకు తీసుకోవడం లేదు?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఈచిత్రంలో ఒక కీలక పాత్ర కోసం మొదట రామ్ చరణ్, ఆ తర్వాత మహేష్ బాబు అంటూ పుకార్లు షికారు చేశాయి. అంతేకాకుండా ఆ పాత్ర నటించడం వలన ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు సంతోష పడేవారు. కాకపోతే సీన్ లోకి మళ్లీ చరణ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ పాత్ర ఒక యువ నాయకుడు తరహాలో ఉంటుంది అని, అంతేకాకుండా ఫ్లాష్ బ్యాక్ లో నక్సలైట్ ఉద్యమం కూడా ఉండనుంది అని సమాచారం. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత అందరూ పవన్ గురించి మాట్లాడటం మొదలు పెట్టారు.

దాదాపు రెండేళ్ల విరామం తీసుకొని పవన్ కళ్యాణ్ వకిల్ సాబ్ తో రీఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఎలాగో సినిమాల్లో మళ్లీ నటించడం మొదలు పెట్టారు. అయితే చిరు సినిమాలో అవకాశం వస్తే పవన్ నటించడానికి సిద్దం అని గతంలో తెలిపారు. అయితే జల్సా సినిమాలో నక్సలైట్ పాత్రలో కూడా కనిపించారు పవన్. అయితే ఆచార్య చిత్రం లో ఇలాంటి పాత్ర కోసం పవన్ నీ సంప్రదిస్తే ఖచ్చితంగా చేసేవాడు, వెనకడుగు వేసేవాడు కాదు . అలాంటి పవన్ నీ తీసుకోకుండా అడ్డుపడుతుంది ఎవరై ఉంటారు. లేదంటే, రాజకీయాల్లో పవన్ దూకుడు కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఏదేమైనా పవన్ మాస్ యాక్టింగ్ జల్సా లో సినిమా కే హైలెట్ అయింది. మరి పవన్ అభిమానులకు ఆ కిక్ నీ దక్కకుండా చేస్తుంది ఎవరై ఉంటారు.

error: Content is protected !!