లైఫ్ బాయ్ యాడ్ లో నటించిన ఈ చిన్న పిల్ల ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…

దేశంలోని ప్రముఖ సబ్బుల తయారీ సంస్థ లైఫ్ బాయ్ సంస్థ గురించి అందరికీ బాగానే తెలుసు.అయితే ఈ లైఫ్ బాయ్ సంస్థ తమ కంపెనీ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు చిత్రీకరించినటువంటి ప్రకటనల్లో “బంటి నీ సబ్బు స్లో ఏంటి” అంటూ తన ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకునే చిన్న పిల్ల అవనీత్ కౌర్ అందరికీ బాగానే గుర్తు ఉంటుంది.అయితే ప్రస్తుతం అవనీత్ కౌర్ ఎలా ఉందో ఓసారి లుక్కేద్దాం…

సినీ పరిశ్రమలో మొదటగా చిన్న చిన్న ప్రకటనలో నటించినటువంటి అవనీత్ కౌర్ కొన్ని సినిమాల్లో కూడా నటించింది.ఇందులోభాగంగా ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ప్రదీప్ సర్కార్ దర్శకత్వం వహించిన టువంటి మర్దాని అనే చిత్రంలో కూడా ఓ ప్రాముఖ్యత కలిగినటువంటి పాత్రలో నటించింది. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి మర్దాని 2, క్వారీబ్ క్వారీబ్ సింగల్ లే, ఏక్తా, తదితర చిత్రాల్లో కూడా నటించింది.

అయితే ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించినప్పటికీ కొత్త అవకాశాలను మాత్రం రబట్టలేకపోయింది. అయితే 2017వ సంవత్సరంలో స్టార్ మా ఛానల్ లో ప్రసారమయినటువంటి “చంద్ర నందిని” అనే ధారావాహికలో నటించి అవినీత్ కౌర్ సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.అయితే ప్రస్తుతం ఈ అమ్మడు ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నిజ జీవిత ఆధారంగా తెరకెక్కిస్తున్నటువంటి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

error: Content is protected !!