వెంకటేష్ పారితోషికం ఒక్కసారిగా ఎంత పెరిగిందో తెలుసా ?

సీనియర్ హీరోల్లో బాలకృష్ణనే 9 నుంచి 10 కోట్లు పక్కాగా తీసుకునే హీరో. ఈ విషయంలో నాగార్జున, వెనకటేష్ నిన్న మొన్నటి వరకు ఐదు నుంచి 6 కోట్లు దగ్గరే ఉన్నారు. అయితే ఇప్పుడు వెంకటేష్ కూడా రేటు పెంచేశాడు. ఎఫ్ 2, వెంకీ మామ తర్వాత నారప్ప సినిమాలో నటిస్తున్నాడు వెంకటేష్. ఈ సినిమాపై కాస్త అంచనాలు ఉన్నాయి.

ఇలాంటి సమయంలో దిల్ రాజు- అనిల్ రావిపూడి కలసి ఎఫ్ 3 ప్లాన్ చేశారు. ఈ సినిమాకు వెంకటేష్, వరుణ్ తేజ్ కీలకం. అందుకే ఈ ప్రాజెక్ట్ లో షేర్ కావాలనే దగ్గర బేరం ప్రారంభించాడు వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు. ఆఖరికి 10 కోట్ల పారితోషికం వరకు వచ్చింది వ్యవహారం. చివరకు 10 కోట్ల లోపే బేరం సెట్ అయ్యింది కానీ,

తర్వాత సినిమాలకు మాత్రం ఇక రెమ్యునరేషన్ 10 కోట్లే అన్నది ఇండస్ట్రీ టాక్. అంటే ఇక నాగార్జున మాత్రమే మిగిలారు అన్నమాట. సీనియర్లలో అయిదారు కోట్ల రేంజ్ లో. ఓ రెండు హిట్ లు పడితే ఆయన రెమ్యూనిరేషన్ కూడా మారొచ్చు. కానీ ప్రస్తుతానికి అయితే ఆ అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు.

error: Content is protected !!