కాశీలో చిక్కుకున్న 69 మంది తెలుగు రాష్ట్రాల భక్తులు

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు భారతదేశ ప్రజలందరూ 21 రోజులు లాక్ డౌన్ కి వెళ్లాలని సూచించారు. అయితే ఈ నేపధ్యంలో పలు చోట్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే తెలంగాణ కి చెందిన 40 మంది యాత్రికులు వారణాసి లో చిక్కుకున్నారు. మేడ్చల్, మల్కాజ్ గిరి, ఘట్లేసర్, సిద్దిపేట జిల్లా వాసులు ఉన్నారు.

అయితే వారందరూ తమని సొంత ఊళ్లకు పంపాలంటూ వేడుకుంటున్నారు. అలాగే తూర్పు గోదావరికి చెందిన 29 మంది యాత్రికులు ఉన్నారు. తినడానికి తిండి లేక, పలు రకాల ఇబ్బందులు పడుతున్నా మని, స్వస్థలాలకు పంపాలని వేడుకుంటున్నారు. అయితే ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కటిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరి వారి గోడు మీడియా ద్వారా వెల్లడించారు.

error: Content is protected !!