గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మెగా సినిమాలు లేనట్టేనా…గ్యాప్ కి కారణం ఇదే… ?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి ఇండస్ట్రీకి వచ్చాక ఇప్పుడు మూడవ సినిమా చేస్తున్నాడు. ఈ మూడూ కూడా కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ మీదే కావడం విశేషం. ఇది చూసాక టాలీవుడ్ ఇండస్ట్రీ మెగాస్టార్ కి, నిర్మాత అల్లు అరవింద్ లకు మధ్య సినిమాల పరంగా సాన్నిహిత్యం తగ్గిందని టాక్ నడుస్తోంది. గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై చిరంజీవితో అరవింద్ చాలానే సినిమాలు నిర్మించాడు. కానీ ఖైదీ నెంబర్ 150 సినిమా నుండి అల్లు అరవింద్ కు చిరంజీవి సినిమా నిర్మించే అవకాశం దొరకట్లేదు. రీఎంట్రీ నుండి ఇప్పటి వరకు చిరంజీవి తన కొడుకు రాంచరణ్ నిర్మాణంలోనే నటిస్తుండటం తో చిరు,అరవింద్ ల నడుమ ఇంతవరకు వీళ్ళ కాంబినేషన్ కుదరలేదు.

కొణిదెల ప్రొడక్షన్స్ ప్రారంభించిన రాంచరణ్ మెగాస్టార్ తో ఖైదీ నెంబర్ 150 సినిమా నిర్మించి విపరీతమైన లాభాలు పొందాడు. ఆ వెంటనే మళ్ళీ మెగాస్టార్ తో పాన్ ఇండియా మూవీ ‘సై రా నరసింహరెడ్డి’ భారీ బడ్జెట్ తో సినిమా రూపొందించాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఇక నిర్మాణంలోకి రాడేమోనని అందరూ భావించారు. ఇప్పుడైనా అల్లు అరవింద్ కి అవకాశం వస్తుందేమోనని భావించారట. కానీ కొరటాల శివతో చేస్తున్న సినిమా కూడా మాట్నీ ఎంటర్టైన్మెంట్ వారితో కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండటంతో అరవింద్ కి ఛాన్స్ పోయింది.

ఇక తాజా కథనాల ప్రకారం మెగాస్టార్ నెక్స్ట్ సినిమా మైత్రి మూవీ మేకర్స్ వారితో కుదుర్చుకున్నట్లు చెబుతున్నారు. ఈ విధంగా చూసుకుంటే చిరంజీవి-రాంచరణ్ లు అల్లు అరవింద్ ను కావాలనే అవాయిడ్ చేస్తున్నారని సినీ ఇండస్ట్రీ కోడై కూస్తుంది. మరి చిరంజీవి-అరవింద్ ల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. అరవింద్ నిర్మాణంలో సినిమా మాత్రం ఈ మధ్య కాలంలో రాదని తేలిపోవడంతో అసలు వీరి కాంబోలో మూవీ వస్తుందా రాదా అనేది మెగా కాంపౌండ్ నుంచి తెలియాలి.

error: Content is protected !!