మోక్షజ్ఞతో సినిమా చేస్తానంటున్న అనిల్….సాధ్యమేనా…?

కొందరు డైరెక్టర్స్ తక్కువ కాలంలోనే తాము అనుకున్నది రీచ్ అవుతారు. కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసిన కల్సి రాదు. మరి టాలీవుడ్ లో వచ్చిన అనతి కాలంలో హిట్ ట్రాక్ అందుకుని ఎక్కువ శాతం సక్సెస్ రేటు గల యంగ్ దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. గత ఏడాది ఎఫ్2 తో హిట్ కొట్టి ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్ర విజయాన్ని అనిల్ ఎంజాయ్ చేస్తున్నాడు.

ప్రస్తుతం అనిల్ రావిపూడి గత ఏడాదిలో సంక్రాంతికి విడుదలైన ఎఫ్2 చిత్రానికి సీక్వెల్ ని తెరక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.అంతేగాక ఈ చిత్రంలో ఇప్పటికే 3వ పాత్ర కోసం మాస్ మహారాజ్ రవితేజని తీసుకున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అనిల్ రావిపూడి ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

తన భార్య భార్గవిని తాను చదువుకునే రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నా నని అనిల్ తెలిపాడు. అలాగే తానేమి టాపర్ ని కాకపోయినప్పటికీ ప్రతీ పరీక్ష బాగానే పాస్ అయ్యేవాడనని సరదాగా చెప్పుకొచ్చాడు. ఇక సినిమా పరంగా అయితే ఇప్పటికే నందమూరి బాలకృష్ణ ,ఆయన కొడుకు మోక్షజ్ఞతో కలిసి దిగిన ఫోటో తన గదిలో పెద్ద పోస్టర్ గా చేయించి గోడకు తగిలించానని, ఎప్పటికైనా బాలకృష్ణ తో గానీ, మోక్షజ్ఞతో గానీ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తానని చెప్పుకొచ్చాడు.

error: Content is protected !!