మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం – సినీ కార్మికులకు భారీ విరాళం…

ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ వ్యాపిస్తున్న కారణంగా దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలకమైన చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో దేశం మొత్తం కూడా లాక్ డౌన్ ప్రక్రియను అమలు చేశారు. ఈ తరుణంలో దాదాపుగా దేశంలోని సేవలు, సర్వీసులు అన్ని ఎక్కడికక్కడే నిలిచిపోయాయి… .ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖులందరూ కూడా తమ వంతు బాధ్యతను నిర్వహిస్తూ, కార్మికులకు, కర్షకులకు కొంత విరాళాన్ని కూడా అందజేస్తున్నారు. కాగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులందరి కొసం ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.

కాగా సినీ కార్మికులందరికీ కూడా మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళాన్ని ప్రకటించారు. కోటి రూపాయాలని వారి సంరక్షణార్థం విరాళంగా ఇచ్చారు. కాగా కరోనా వైరస్ విలయంతో లాక్ డౌన్ తప్పనిసరి కావడంతో దినసరి కూలీలు, అల్పాదాయ వర్గాలపైనే కాకుండా సినీ కార్మికులపైనా తీవ్ర ప్రభావం పడుతోందని మెగాస్టార్ చిరంజీవి తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా వెల్లడించారు. అందుకనే చిరంజీవి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీపై ఆధారపడిన సినీ కార్మికులకు రూ.1 కోటి విరాళం ప్రకటిస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా సినీ కార్మికుల సహాయార్థం పరిశ్రమకు చెందిన వారందరు కూడా ముందుకు రావాలని చిరంజీవి గారు పిలుపునిచ్చారు.

error: Content is protected !!