పవన్ కళ్యాణ్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేసిన ధనరాజ్

పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒకరైన టువంటి టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ ధనరాజ్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.తనకు టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం అని చెప్పుకొచ్చాడు.

అంతేకాక ఇప్పటి వరకూ తాను పవన్ కళ్యాణ్ నటించినటువంటి నాలుగు చిత్రాల్లో కమెడియన్ పాత్రలు చేశానని తెలిపాడు.అంతేగాక పవన్ కళ్యాణ్ చిత్రం అంటే తన పాత్రకి ప్రాధాన్యత ఉందా లేదా అనేది ఆలోచించని డైరెక్ట్ గా ఓకే చెబుతానను కూడా తెలిపాడు.

అంతేగాక మెగాస్టార్ చిరంజీవి ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని హీరో అవ్వాలని సినీ పరిశ్రమకు వచ్చానని తెలిపాడు.అంతేగాక ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలకి తాను అందుబాటులో లేకపోవడంతో జనసేన పార్టీ తరఫున ప్రచారం చేయలేకపోయాననీ చెప్పుకొచ్చాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో ఈ టీవీ ఛానల్ లో ప్రతి గురు, శుక్రవారాల్లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయినటువంటి ధనాధన్ ధన్ రాజ్ ప్రస్తుతం పలు రకాల షోలు ఈవెంట్లతో బిజీ బిజీగా గడుపుతున్నాడు.అంతేగాక జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యేటువంటి అదిరింది అనే షోలో కమెడియన్ గా నటిస్తున్నాడు.

error: Content is protected !!