జబర్దస్త్ లో వాళ్లిద్దరూ నిజంగా కొట్టేసుకున్నారా….నిజం ఇదే… ?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో అన్నీ జోకులే ,నవ్వులే కాదు ఒక్కోసారి సీరియస్ కూడా అవుతుంటుంది. అలాగే ఈ రోజు వచ్చే వారం ఎపిసోడ్ ప్రోమో చూస్తే, అప్పారావు, బులెట్ భాస్కర్ కొట్టుకున్న సీన్ ఉంది. ఇలాంటివి కంటపడితే సోషల్ మీడియా వదలదు కదా. అందుకే ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెద్దాయన్ని అలా కొట్టడం ఏంటి అంటూ కొందరు నిజంగానే కామెంట్స్ కూడా పెడుతున్నారు. అయితే ‘ఇదంతా తుస్.. ఒట్టిదే.. ప్రేక్షకులను ఎన్నిసార్లు వాళ్లు ఇలా బకరాలను చేయలేదు’ అంటూ తీసిపాడేస్తున్నారు. తమ స్కిట్ గురించి జనాలు మాట్లాడుకునేలా చేయాలనేది జబర్దస్త్ నిర్వాహకుల ప్లాన్. అందుకే ప్రోమో టార్గెట్ అయితే రీచ్ అయిపోయారు.

దాంతో అక్కడ నిజంగానే అప్పారావు, భాస్కర్ కొట్టుకున్నారా లేదా అనేది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ కోసం వేచి చూడక తప్పదు. అప్పటి వరకు ఈ సస్పెన్స్ అయితే మెయింటేన్ అవుతుంది. అయితే అంతర్గత వర్గాల కథనం చూస్తుంటే, నిజానికి అక్కడ జరిగింది నిజమైన గొడవ కాదు. అప్పట్లో షకలక శంకర్ చేసిన స్కిట్‌కు సీక్వెల్ అని చెబుతున్నారు. కొన్నేళ్ల కింద ఇదే అప్పారావును స్టేజీపై ఇష్టమొచ్చినట్లు కొట్టాడు శంకర్. అప్పుడు కూడా స్కిట్‌లో భాగంగానే, ఇద్దరూ సీరియస్ అయిపోయారు . అది నిజమైన గొడవ అనుకుని అక్కడున్న వాళ్లు కూడా షాక్ అయ్యారు.

ఆ తర్వాత తమ స్కిట్‌లో భాగమనే చెప్పారు. ఇప్పుడు కూడా ఇదే అంటున్నారు. ముఖ్యంగా హైపర్ ఆది లాంటి వాళ్ళ ముందు ఆయన నిలబడలేక, బుల్లెట్ భాస్కర్ స్కిట్స్ ఈ మధ్య అస్సలు పేలడం లేదు. దాంతో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే కానీ తమకు రేటింగ్ రాదని ఫిక్సై, అప్పారావుతో గొడవ నాటకం ఆడారని తెలుస్తుంది. దీని వెనక స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్ నేర్పు కూడా ఉందట. జీ తెలుగులో అదిరింది షో తో పోటీ మొదలై నందున జబర్దస్త్ వాళ్లు కూడా జిమ్మిక్కులు మొదలుపెట్టారు. అందుకే ఈ రగడ.

error: Content is protected !!