కరోనా ఎఫెక్ట్ : మోదీ మరో కఠిన నిర్ణయం ? లాక్ డౌన్ ఏప్రిల్ 14 కాదా ? పెంచుతున్నారా ?

భయంకరమైన మహమ్మారి కరోనా నివారణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిసి దేశ వ్యాప్తంగా లక్డౌన్ ని అమలు చేసిన సంగతి మనకు తెలిసిందే… అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా మన ప్రభుత్వాలు చాలా కఠినమైన ఆదేశాలను కూడా జారీ చేశారు. ఎవరైనా బయట కనబడితే పోలీసులు వారిని చితకబాదుతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ భయంకరంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోడీ మరొక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకోనున్నాడని సమాచారం. అదేంటంటే… ఈ లాక్ డౌన్ కాలాన్ని మరికొన్ని రోజులు పెంచనున్నారని తాజా సమాచారం. అయితే మన దేశంలో ఉన్న జనాభా దృష్ట్యా రాబోయే రోజుల్లో కరోనా బాధితుల సంఖ్య 5 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

అందుకనే ఈ తరుణంలో 21 రోజుల లాక్‌డౌన్ సరిపోదని, ఏప్రిల్‌ 15 తర్వాత కూడా మరికొన్ని రోజులు ఈ లాక్ డౌన్ పీరియడ్ ని కొనసాగించే అవకాశం ఉందని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ కార్యాలయ ఉన్నతాధికారి అధికారికంగా ప్రకటించారు. అయితే ఇతర దేశాల్లో జరిగినటువంటి దారుణాలు మన దేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా చూసుకోవాలని, అందుకనే ఈ ఖఠినమైన నిర్ణయాలను తీసుకోనున్నారని తాజా సమాచారం. అయితే పరిస్థితి చేయి దాటిపోయి, ఈ భయంకరమైన వైరస్ మరింతగా విజృంభిస్తే అందరికీ చికిత్స చేసే సదుపాయాలు మన దేశంలో లేని కారణంగా, ఈ వైరస్ ని నియంత్రించే తరుణంలో మనం అదుపు కోల్పోతామని వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. అందుకనే దేశ వ్యాప్తంగా అమలులో ఉన్న ఈ లాక్ డౌన్ కి ప్రజలందరూ కూడా తమ వంతు సహాయాన్ని అందించాలని కోరుకుంటున్నారు.

error: Content is protected !!