తొందరపడి ఆ నిర్ణయం తీసుకోవటం పెద్ద తప్పు అంటున్న రాశీ ఖన్నా

వరుస హిట్స్ తో స్టార్ హీరో గా మారిపోయిన టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ మళ్ళీ వరుస ప్లాప్ లు తెచ్చుకుంటున్నాడు. దానికి తోడు ఈమధ్య వచ్చిన “వరల్డ్ ఫేమస్ లవర్” అనే చిత్రం విడుదలై బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఒకరా ఇద్దరా ఏకంగా నలుగురు హీరోయిన్స్ . రాశి ఖన్నా, కేథరిన్ తెరెసా, ఐశ్వర్య రాజేష్, ఇంగ్లీష్ నటి ఇసాబెల్లా తదితరులు హీరోయిన్స్ గా చేసారు.

అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అనుకోకుండా పరాజయం కాకతప్పలేదు. తాజాగా ఈ చిత్ర ఫలితాలపై భారీగా ఆశలు పెట్టుకున్నట్టు వంటి రాశి కన్నా ఇప్పుడు తెగ బాధ పడుతోందట. దీంతో మొహమాటాలకు పోకుండా కథల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తోందట ఏ
దేమైనప్పటికీ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం తనకు ఓ గొప్ప గుణపాఠమని ఇప్పటికే పలు సందర్భాల్లో ఇన్ డైరెక్టుగా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.

కానీ వరల్డ్ ఫేమస్ సినిమా మాత్రం డిజాస్టర్ అయినప్పటికీ రాశికన్నా పాత్రకు మాత్రం సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.అయినప్పటికీ ఎందుకు రాశీ కన్నా ఈ చిత్ర ఫలితాలపై సంతృప్తిగా లేకపోగా తొందరపడి నిర్ణయం తీసుకున్నాను అంటూ ఇప్పటికే తన సన్నిహితులతో చెప్పేసి తెగ ఫీలయిందట.

error: Content is protected !!