RRR మోషన్ పోస్టర్ ఎఫెక్ట్.. ఎన్‌టీఆర్, చరణ్ అభిమానుల మధ్య వార్ స్టార్ట్..!

తెలుగులో మల్టీస్టారర్ సినిమాలు తీయాలంటే దర్శకులకు కాస్త భయం ఎక్కువనే చెప్పాలి. అయితే ఒక హీరో, మరో హీరో మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నా ఫ్యాన్స్‌లో మాత్రం అలాంటివి కనిపించవు. మా హీరో నంబర్ వన్ అంటే, మా హీరోనే నంబర్ వన్ అంటూ గొప్పలు చెప్పుకుంటుంటారు.

అయితే ఇదే పరిస్థితి ఇప్పుడు రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకి కూడా ఎదురయ్యింది. తాజాగా ఉగాది సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేసారు. అయితే ఇందులో చరణ్, ఎన్టీఆర్ లుక్స్ అదిరిపోగా, రెస్పాన్స్ కూడా భారీగానే ఉంది. అయితే RRR మోషన్ పోస్టర్‌లో చరణ్ నిప్పులోంచి వస్తే, ఎన్టీఆర్‌ను నీటిలోంచి వస్తున్నట్టు చూపించడం జూనియర్ ఫ్యాన్స్‌కి నచ్చడం లేదట. దీనికి తోడు టైటిల్ లోగోలో చరణ్‌ను ముందు పెట్టి, తారక్‌ను వెనుక పెట్టడంతో కావాలనే తమ హీరోను తక్కువ చేసాడంటూ ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ రాజమౌళిపై మండి పడుతున్నారట. అయితే రాజమౌళి ఏది చేసిన అందులో ఒక పెద్ద విషయమే దాగి ఉంటుందని తెలుసుకోకుండా ఇలా చరణ్, ఎన్‌టీఆర్ అభిమానులు ఎందుకు గొడవపడుతున్నారో వారికే తెలియాలి మరీ.

error: Content is protected !!