పూరి పై ఊహించని షాకింగ్ వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్ చిరు

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఉగాధి పర్వదినాన ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ ఖాతాలని తెరిచారు చిరు. అయితే ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరజీవి కి ఘన స్వాగతం లభిస్తోంది. చిరుకి స్వాగతం పలుకుతూ పలువురు ప్రముఖులు, సినీ నటులు, దర్శకులు, నిర్మాతలు ట్వీట్ చేస్తున్నారు. అయితే ఈ జాబితాలో దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఉన్నారు.చిరు కి వెల్కమ్ చెబుతూ, సోషల్ మీడియా కి స్వాగతం, సామాజిక దూరం పాటిస్తున్న సమయంలో సోషల్ మీడియా మనల్ని దగ్గర చేస్తుంది అని అన్నారు.

అయితే దీనికి చిరు స్పందించారు. పూరికి థ్యాంక్స్ చెబుతూనే సటైర్స్ వేశారు. కరోనా ఎఫెక్ట్ తో మంచి ఫ్యామిలీ టైం లభిస్తోంది అని వ్యాఖ్యానించారు. ముంబై, బ్యాంకాక్ బీచ్ లని మిస్ అవుతుంటావు అని చిరు అన్నారు. కానీ పవిత్ర, ఆకాష్ నీతో సమయం గడపడాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు అని చిరు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా చేసేందుకు పోటీ పడిన దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు. చిరు కోసం పూరి ఆటోజానీ కథని రెడీ చేశారు. అది చిరుకి నచ్చింది. కానీ సెకాంఢాఫ్ విషయంలో చిరు సందేహాలు వ్యక్తం చేయడంతో ఆ ప్రాజెక్ట్ కాస్తా ఆగిపోయింది. అయితే పూరీ జగన్నాథ్ చిరు తో ఎప్పటికైనా సినిమా చేస్తా అని గతంలో ఆశాభావం వ్యక్తంచేశారు.

error: Content is protected !!