చిరంజీవి,రామ్ చరణ్ ఒకే ఇంటిలో ఉండటం లేదా…అసలు కారణం ఇదేనా?

మెగాస్టార్ ఫ్యామిలీ అంతా కల్సి ఉంటారని అనుకుంటారు. కానీ ఈ మధ్యే జరిగిన ఈ సీన్ చూసిన తర్వాత ఈ అనుమానం అందర్లోనూ తెలీకుండా దొలిచేస్తోందట. ఇప్పటికే తెలుగులో చాలా మంది హీరోలు తమ తమ సొంత ఇళ్లలోకి మారిపోయారు. బన్నీ కూడా కొత్త ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇన్ని రోజులు తల్లిదండ్రులతోనే ఉన్న ఈయన.. ఇప్పుడు మరో ఇంటికి వెళ్ళనున్నాడు. మనోజ్, విష్ణు లాంటి వాళ్లు ఎప్పుడో అది చేసారు. నాగ చైతన్య అయితే పెళ్లికి ముందు నుంచే ప్రత్యేకంగా ఇల్లు తీసుకున్నాడు.ఇప్పుడు రామ్ చరణ్ కూడా తన తండ్రి నుంచి దూరంగా ఉన్నాడని టాక్.

మొన్నటి వరకు అంతా కలిసే ఉన్నా కూడా కొన్ని రోజుల కింద ఉపాసన, చరణ్ దంపతులు మరో ఇంటికి మారిపోయారని ప్రచారం జొరాగానే నడుస్తోంది. ఇందులో విడిపోవడం అనేది ఏం లేదని.. కొన్ని రోజులు ఇద్దరూ ఉండాలని అలా వెళ్లినట్లు చెబుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, మొన్నటికి మొన్న జనతా కర్ఫ్యూ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా బయటికి వచ్చి చప్పట్లు కొట్టి తమ సంఘీభావం తెలపాలని మోదీ కోరినప్పుడు చిరు ఇంటి సభ్యులు కూడా బయటికి వచ్చారు.

అయితే అందులో చెర్రీ లేకపోవడం ఫాన్స్ కూడా గమనించారు. చిరుతో పాటు చెల్లెళ్ళు, వాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కానీ రామ్ చరణ్, ఉపాసన మిస్ అయ్యారు. అదే విధంగా రామ్ చరణ్ కూడా ఓ ఇంటి బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొట్టాడు. ఇక్కడ చిత్రం ఏంటంటే చిరంజీవి పాత ఇంటిని తన అభిరుచికి తగ్గట్లుగా రామ్ చరణ్ మార్చుకున్నాడు. అలాంటప్పుడు ఆయన దూరంగా ఉండాల్సిన అవసరం ఏంటో అర్ధం కావడం లేదు. మొన్న చప్పట్లు కొట్టినపుడు కూడా చరణ్ ఒక్కడే కనిపించాడు. ఈ లెక్కన తండ్రి చిరు కుటుంబంతో కలిసి ఉపాసన, చరణ్ లేరని తెలుస్తుంది. మొత్తానికి ఏదేమైనా కూడా ఇద్దరూ సమీపంలోనే ఉన్నా, దూరం పాటిస్తున్నారు.

error: Content is protected !!