ఈ 21 రోజులు చిరంజీవి డ్యూటీ ఇదేనంట – ఏంటో మరి…?

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే సోషల్ మీడియా లోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ మేరకు చిరంజీవి ఒకేసారి ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలు తెరిచి వరుస పోస్టులతో అందరిలో ఒకరిలాగా కలిసిపోయారు. ఇకపోతే ప్రస్తుతానికి ప్రపంచాన్ని అంతటిని కూడా వణికిస్తున్నటువంటి మహమ్మారి కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం 21 రోజులు పాటు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో దాదాపుగా అందరు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. కాగా ఈ మేరకు గత కొంత కాలంగా ఇంట్లోనే ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటున్నారు.

ఈ సమయంలో చిరంజీవి తన స్నేహితులు, సెలబ్రిటీలు, అభిమానులతో ముచ్చటిస్తూ కాలం గడుపుతున్నారు. దానికి తోడు తనకు సంబందించిన ఫొటోలను కూడా షేర్ చేస్తూ అందరితో పంచుకుంటున్నారు. ఈ మేరకు చిరంజీవి తాజగా ఒక ఫొటో పెట్టుకున్నారు. ఈ ఫోటోలో తన ఇంట్లో ఉన్న మొక్కలకు నీళ్లు పెడుతున్నాడు. దీనికి మొక్కే కదా అని వదిలేస్తే.. అని తన సినిమాలోని ఒక డైలాగ్ ని ఆడ్ చేసుకున్నారు. కాగా ప్రస్తుతానికి ఎలాంటి సినిమా షూటింగులు లేని కారణంగా గత 21 రోజులు ఇదే నా డ్యూటీ అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ ఫోటో సామాజిక మాంద్యమాల్లో వైరల్ అవుతుంది.

error: Content is protected !!