కరోనా ఎదుర్కొనేందుకు మహేష్ బాబు సూత్రాలు పాటించండి

కరోనా పేరు చెబితే ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం దేశమంతా లాక్డౌన్ చర్యలు చేపడుతుంది. 21రోజులపాటు లాక్డౌన్ కొనసాగుతుందని ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే కరోనాపై అవగాహన కల్పించేందుకు పలువురు సెలబెట్రీలు తమవంతు కృషి చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కరోనాను ఎదుర్కొనేందుకు పాటించాల్సిన నియమాలను వీడియో రూపంలో చేశారు. అలాగే మెగా కోడలు ఉపాసన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. అలా పలువురు సెలబ్రెటీలు తమ బాధ్యతగా కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనాను ఎదుర్కొనేందుకు పాటించాల్సిన ఆరు నియమాలను తన ట్వీటర్ అకౌంట్లో పోస్టు చేశారు. ఈ ఆరు నియమాలను పాటిస్తూ స్వీయ నియంత్రణ పాటించినట్లతే సంతోషంగా జీవితాన్ని గడపవచ్చని పేర్కొన్నారు. అలాగే ట్వీటర్ ద్వారా ప్రతీఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

మహేష్ బాబు చెప్పిన ఆరు నియమాలు ఇవే..

– ప్రతీఒక్కరు ఇంట్లోనే ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలి.
– చేతులను 20నుంచి 30 సెకన్లపాటు రోజులో వీలైనన్నీ సార్లు సబ్బు నీళ్లతో కడుక్కోవాలి. –
– మీ ముఖాన్ని తాకకండి. ముఖ్యంగా కళ్లు, నోరు, ముక్కును అసలు తాకకండి.
– దగ్గినపుడు, తుమ్మినపుడు మీ మోచేతులను లేక టిష్యూను అడ్డుగా పెట్టుకోండి.
– సామాజిక దూరం(స్వీయనియంత్రణ) పాటించాలి. ఇంట్లో, బయట ఇతరులకు కనీసం మూడు మీటర్ల దూరంలో ఉండాలి.
– మీకు కరోనా లక్షణాలు లేక అనారోగ్యం ఉంటేనే మాస్క్ వాడండి. అలాగే కోవిడ్‌-19 లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

error: Content is protected !!