తన తండ్రి చనిపోతే ఈ జబర్దస్త్ కమెడియన్ ఎలాంటి కష్టాలు పడ్డాడో తెలుసా…

ప్రతి గురు, శుక్రవారాల్లో ఈటీవీ ఛానల్ 9:30 నిమిషాలకు ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ఎంతగా పాపులర్ అయిందో పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే ఈ కామెడీ షోలో ఇటీవల కాలంలో హైపర్ ఆది టీంలో పని చేస్తున్నటువంటి లండన్ డ్రాయర్ రాజు గురించి అందరికీ బాగానే తెలుసు.అయితే స్కిట్ లో డైలాగు చెప్పే సమయంలో నోరు తిరగక చాలా అవస్థలు పడుతూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు ఈ రాజు.అయితే తాజాగా రాజు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఇందులో భాగంగా తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.అయితే ఇందులో తాను ఒంగోలు ప్రాంతానికి చెందినటువంటి ఓ మారుమూల గ్రామం నుంచి సినీ పరిశ్రమలోకి వచ్చానని తెలిపాడు.

అయితే తమ గ్రామంలో తాను తన తల్లి మరియు తండ్రి ముగ్గురు కలిసి ఊరి చివరన ఉన్నటువంటి తమ పొలంలో నివాసం ఉంటామని, ఉన్నట్లుండి తన తండ్రి చనిపోతే కనీసం తన తండ్రి శవాన్ని చూడటానికి కూడా ఎవ్వరు రాలేదని ఎమోషనల్ అయ్యాడు.అయితే ఆ క్షణం తాను ఎంతో మానసికంగా కృంగి పోయారని చెప్పుకొచ్చాడు.

దాంతో ఎలాగైనా నటుడు కావాలని అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో హైపర్ ఆది పిలిచి అవకాశం ఇచ్చారని లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ అనే డైలాగుతో కొంత సమయంలోనే బాగా పాపులర్ అయ్యానని చెప్పుకొచ్చాడు.అంతేకాక బయట అవకాశాల కోసం తనలాగే కష్టాలు పడుతూ చాలా మంది ఎదురు చూస్తున్నారని, అవకాశాలు అందరికీ అంత సులభంగా దొరకవని కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చక్కగా ముందుకుపోవాలని తెలిపాడు. అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం లండన్ రాజు జబర్దస్త్ లో నటిస్తూనే మరో పక్క సినిమాలు, ఈవెంట్లలో కూడా నటిస్తున్నాడు.

error: Content is protected !!