కరోనాపై పోరాటానికి జనసేనాని ఇచ్చిందెంతో తెలుసా? ఇవ్వటానికి అసలు కారణం ఇదే

మాయదారి కరోనా మహమ్మారిపై ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి సహకరించాల్సిన సమయం ఇది. ఎన్నో ప్రకృతి విపత్తులు వచ్చినా కరోనా లాంటి రక్కసి రావడం ఈ జనరేషన్ లో ఇదే తొలిసారి. పైగా ఎక్కడ,ఎవరికీ ఎలా వస్తుందో తెలీదు. ఇలాంటి మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించింది. అయితే పేదలకు పనులు లేక ఇబ్బంది పడతారు. ఇలాంటి వారిని ఆదుకోడానికి తన వంతు సాయం చేయాలన్న తపన చాలా అవసరం. అలాంటి గుణం జనసేనాని పవన్ కల్యాణ్ లో పుష్కలంగా ఉంది.

తన అభిమాని హీరో అయిన్ నితిన్ ఇప్పటికే రెండు రాష్ట్రాలకు పది లక్షల చొప్పున విరాళం ఇవ్వగా, పవన్ తన స్థాయికి తగ్గట్టే స్పందించాడు. కేంద్రానికి కోటి రూపాయలు అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు 50లక్షల చొప్పున కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. మరోవైపు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏపీకి పది లక్షలు, తెలంగాణకు పది లక్షలు ప్రకటించారు. త్వరలో వీటిని ఆయా ముఖ్యమంత్రులకు పంపనున్నారు.

రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు తన వంతు ఆర్థిక సాయంగా రూ.50 లక్షల చొప్పున ప్రకటిస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. పవన్ తీసుకున్ననిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటివి పవన్ లాంటోడు మాత్రమే నిర్ణయాలు తీసుకోగలరని పేర్కొన్నారు. మరొకరు ఒక అడుగు ముందుకేసి.. అందుకే కదా మీరంటే ఇంత పిచ్చి.. అంటూ తమ అభిమానాన్ని వెల్లడించాడు. పవన్ ప్రకటనపై జబర్దస్త్ నటుడు హైపర్ ఆది సోషల్ మీడియాలో స్పందిస్తూ.. గురువుగారు.. మీ నిర్ణయానికి నోటి వెంట మాటలు రావట్లేదు.. అంటూ తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు.

error: Content is protected !!